ఎన్టీఆర్33 కు డైరెక్టర్ అతనేనా?
దేవర(Devara) సినిమా సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేసి ప్రస్తుతం అయాన్ ముఖర్జీ(Ayaan Mukharjee) దర్శకత్వంలో చేస్తున్న వార్2(War2) సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్(Jr. NTR) ముంబైలో ఉన్నాడు. జనవరి లోగా ఎన్టీఆర్ భాగం వరకు షూటింగ్ పూర్తి చేయాలని డైరెక్టర్ చాలా ప్లానింగ్ తో ఉన్నాడు. ఆ తర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్(Prasanth Neel) దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) బ్యానర్ లోని సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన 33(NTR33)వ సినిమాకు సంబంధించిన డైరెక్టర్ ను లాక్ చేసుకున్నాడనే వార్త నెట్టింట వైరల్ అవుతుంది. ఇప్పటికే కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రశాంత్ నీల్, హిందీ పరిశ్రమకు చెందని అయాన్ ముఖర్జీతో పని చేస్తున్న తారక్(Tarak) ఇప్పుడు తమిళ డైరెక్టర్ అయిన నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ ఇప్పటికే ఇద్దరి మధ్యా పలు సార్లు స్టోరీ డిస్కషన్స్ జరిగి కథ విషయంలో ఏకాభిప్రాయంకు వచ్చినట్లు సమాచారం. ఎన్టీఆర్ సొంత బ్యానర్ తో పాటూ మరో నిర్మాత ఎవరు ఉండాలనే దాన్ని బట్టి అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్సుంది. ఒకవేళ సినిమా ఓకే అయినా అది సెట్స్ పైకి వెళ్లడానికి చాలానే టైమ్ పట్టే ఛాన్సుంది. ఒకవేళ ఈ కాంబో నిజమైతే మాత్రం మాస్ ఆడియన్స్ కు పండగే.