దేవరను టార్గెట్ చేస్తున్న నెటిజన్లు
బాక్సాఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్ అయిన దేవర(Devara) సినిమా 40 రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చింది. అయితే ఓటీటీలోకి వచ్చాక ఈ సినిమాపై ట్రోలింగ్ ఎక్కువగా వస్తుంది. చాలా మంది దేవర గురించి నెగిటివ్ ను ప్రచారం చేస్తున్నారు. థియేటర్లలో భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న ఓ సూపర్ హిట్ సినిమాకు డిజిటల్ రిలీజ్ లో ఇలాంటి రెస్పాన్స్ రావడం చాలా అరుదు.
ముఖ్యంగా దేవర సెకండాఫ్ లో డైరెక్టర్ (Koratala Siva) కొన్ని లాజిక్స్ వదిలేశాడు. దాన్ని నెటిజన్లు స్క్రీన్ షాట్లు, వీడియోలు తీసి మరీ షేర్ చేస్తున్నారు. దేవరని రాయప్ప తన చెల్లి పెళ్లికి పిలవడానికి వచ్చినప్పుడు ఆ అమ్మాయి తనకు కూడా చెల్లేనని దేవర అంటాడు. ఆ లెక్కన రాయప్ప కూతురు తంగం, దేవర కొడుకు వరకు చెల్లి వరస అవాలి. కానీ సినిమాలో వారిద్దరూ లవర్స్.
ఇలాంటివి సినిమాలో చాలానే ఉన్నాయి. ఓటీటీలో పాజ్, రివైండ్, ఫార్వార్డ్ ఆప్షన్స్ ఉండటంతో ఫ్రీజ్ చేసి మరీ ఆడియన్స్ దేవరకు పోస్ట్ మార్టం చేస్తున్నారు. అయితే బిగ్ స్క్రీన్ పై గ్రాండియర్ గా అనిపించే సినిమాలు ఓటీటీలో కూడా అదే ఫీలింగ్ ఇవ్వాలని రూలేం లేదు. అందుకే కల్కి(Kalki) డిజిటల్ లో పెద్దగా రికార్డులు సృష్టించలేకపోయింది. ఏదేమైనా దేవర తప్పులను దృష్టిలో పెట్టుకుని దేవర2(Devara2) కథను రాసుకుంటే మంచి అవుట్పుట్ వచ్చే ఛాన్సుంది.