ASBL NSL Infratech
facebook whatsapp X

 నైటా ఆధ్వర్యంలో బోనాల జాతర జులై 28న

 నైటా ఆధ్వర్యంలో బోనాల జాతర జులై 28న

న్యూయార్క్‌ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో జులై 28వ తేదీన బెల్మంట్‌ లేక్‌ స్టేట్‌ పార్క్‌, న్యూయార్క్‌ లో బోనాల జాతరను అబ్బురపరిచే రీతిలో నిర్వహించనున్నారు. ఈ సందర్బంగా ప్రెసిడెంట్‌ వాణి సింగిరికొండ మాట్లాడుతూ తెలంగాణలో ప్రత్యేకంగా అమ్మవారిని పూజించే బోనాలు జాతరను నైటా మొట్టమొదటి సారిగా అమెరికాలో మొదలు పెట్టి గత 3 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా జరుపుతున్నదని చెప్పారు. 

ఈ సంవత్సరం కూడా నైటా కార్యవర్గం ఇంకా ఎంతో వైవిద్యంగా బోనాల కార్యక్రమం నిర్వహించడానికి ముందుకొస్తున్నది. ప్రత్యేకమైన బోనంతో న్యూయార్క్‌ లోని మహిళలు అందరు ముస్తాబై, పిల్లల ఆట పాటలతో కోలాహాహలంగా జరుపుకోడానికి సంసిద్ధమవుతున్నది. ఈ సందర్బంగా బోనాలతోపాటు పలు ఆట పాటలు, పెయింటింగ్‌, ఐస్‌ క్రీం, మంచి తెలంగాణ విందు ఏర్పాటు చేయటం జరుగుతుంది.

ఈ  బోనాల జాతరకి వందలాదిగా తరలి వచ్చి తెలంగాణ పండుగని దిగ్విజయం చేయవలిసిందిగా న్యూయార్క్‌ తెలంగాణ తెలుగు సంఘం ప్రసిడెంట్‌ వాణి సింగిరికొండ, కార్యవర్గం కోరుతున్నది. 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :