ASBL Koncept Ambience
facebook whatsapp X

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (New York Telangana Telugu Association) ఆధ్వర్యంలో ఘనంగా దసరా సంబరాలు

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (New York Telangana Telugu Association) ఆధ్వర్యంలో ఘనంగా దసరా సంబరాలు

న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) దసరా పండుగను న్యూ యార్క్ లోని లాంగ్ ఐలాండ్, Raddison Hotel లో NYTTA ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ ఆధ్వర్యంలో కనులవిందుగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి 500 మందికి పైగా హాజరయ్యారు. Congessman, "Tom Suozzi", Assemblywoman "Jennifer Rajkumar", ప్లాటినం స్పాన్సర్ డా. పైల్లా మల్లారెడ్డి గారు మరియి పద్మశ్రీ డా. నోరి దత్తాత్రేయ గారు ముఖ్య అతిథులుగా హాజరైనారు. 

ముఖ్య అతిధులు మరియి కార్యవర్గ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేయగా, చిన్నారి భవిన్ కొత్త గణేషపంచరత్న స్తుతితో కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

టామ్ మరియు జెన్నిఫర్ లు దసరా శుభాకాంక్షలు తెలియచేస్తూ చట్టసభల్లో ఇండియన్ అమెరికన్ సంఖ్య పెరగాలి అని ఆవిధంగా తమవంతు ప్రోత్సాహన్ని సహకారాన్ని ఇస్తామని తెలియచేశారు. అదేవిధముగా అమెరికాలో స్థిరపడిన తెలుగు కమ్యూనిటీ చూసి చాలా గర్వంగా ఉందని అన్నారు.

సెక్రెటరీ రవీందర్ కోడెల దసరా పండుగ నేపథ్యాన్ని వివరించగా,  NYTTA చైర్మన్ రాజేందర్ జిన్నా గారు ఆహూతులను ఆహ్వానిస్తూ కమ్యూనిటీ కి ప్రెసిడెంట్ వాణి, EC, BOD లు చేస్తున్న కృషిని కొనియాడారు, వ్యవస్థాపకులు శ్రీనివాస్ గూడూరు గారు సంస్థ స్థాపన ముఖ్య ఉద్దేశాలు వివరిస్తు సంస్థ సాధించిన పురోగతిని వివరించారు. 

ప్రెసిడెంట్ వాణి గారు తమ ప్రసంగంలో ఈ సంవత్సరం తాము చేపట్టిన వినూత్న కార్యక్రమాలు, యువతకు ఇచ్చిన ప్రోత్సాహాలు, వైద్య, యోగా కార్యక్రమాల గురించి వివరించారు.  అలాగే తెలంగాణా ప్రత్యేకమైన, అరుదైన పేరిణి నాట్యాన్ని, కళాకారులను  మొట్టమొదటి సారిగా అమెరికాకి తీసుకువచ్చి, ప్రదర్శనలు ఇప్పించి వారిని ప్రపంచానికి ప్రత్యక్షంగా పరిచయం చేశామని చెప్పారు.  అంతేకాకుండా హైదరాబాద్ లో రవీంద్ర భారతి ఆడిటోరియం లో 150 కి పైగా కళాకారులతో ఈ నాట్యాన్ని ప్రదర్శించడం లో NYTTA ముఖ్య భూమిక పోషించడం ఎంతో ఆనందం కలిగించింది అన్నారు.  

ఈ కార్యక్రమంలో భాగంగా ఆద్యంతం తమ గాత్రంతో  గాయని గాయకులు సృష్టి చిల్లా మరియు తరంగ్ వందేమాతరం లు  చక్కటి పాటలతో అలరించారు. గురు సాధనా పరంజి గారి శిష్య బృందం సంప్రదాయ నృత్యం అందించారు. స్థానిక విశ్వవిద్యాలయం  Stony Brook విద్యార్ధులు Junoon నృత్య బృందం సినీ పాటలకు డాన్స్ చేసి ఉర్రూతలూగించారు. 

ఈ కార్యక్రమాలకి సహకరించిన దాతలందరిని NYTTA కార్యవర్గం జ్ఞాపికలు,  శాలువా మరియు పుష్ప గుచ్చాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమ ప్రణాళిక, నిర్వహణలో తోడ్పడిన NYTTA ఎగ్జిక్యూటివ్ కమిటీ, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, అడ్వైసర్స్ లకు, అదేవిధంగా అద్భుత పండగ అలంకారాలు చేయడంలో  సహకరించిన పద్మ కోడెల గారికి మరియు కార్యవర్గానికి ప్రెసిడెంట్ వాణి కృతజ్ఞతలు తెలియచేసారు. 

NYTTA ప్రెసిడెంట్ గా వాణి గారి సేవలని గుర్తిస్తూ నాసా కౌంటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్, Mr.బ్రూస్ బ్లేక్ మన్,  లాంగ్ ఐలాండ్, న్యూ యార్క్, కౌంటీ తరఫున అభినందన పత్రాన్ని అందించారు. 

కార్యక్రమానికి వాఖ్యాతగా వ్యవహరించిన శ్రీలక్ష్మి కులకర్ణి గారికి, Manatv & TV5 మీడియా ప్రతినిథులు రాగిణి మరియు శరత్ గార్లకి ధన్యవాదములు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిధులందరికి NYTTA కార్యవర్గం కృతజ్ఞతలు తెలియజేశారు.

 

Click here for Photogallery

 

 

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :