నిఖిల్ సినిమాకు హైప్ నిల్
కార్తికేయ2(Karthikeya2) సినిమాతో హీరో నిఖిల్(Nikhil) దేశ వ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. అతను హీరోగా సుధీర్ వర్మ(Sudheer Varma) దర్శకత్వంలో వస్తోన్న సినిమా అప్పుడో ఇప్పుడో ఎప్పుడో(Appudo Ippudo Eppudo). నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో సప్త సాగరాలు దాటి(Sapta Saagaralu Daati) సైడ్ ఎ, సైడ్ బి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రుక్మిణి వసంత్(Rukmmini Vasanth) హీరోయిన్ గా నటిస్తోంది.
రిలీజ్ కు మరో నాలుగు రోజులే ఉన్నప్పటికీ ఈ సినిమాపై హైప్ పెంచడం లేదు చిత్ర యూనిట్. నిఖిల్ కెరీర్లోనే అతి తక్కువ క్రేజ్ తో రిలీజ్ అవుతున్న సినిమా అంటే ఇదే. అసలు ఈ సినిమా ఒకటి వస్తుందని కామన్ ఆడియన్స్ కు తెలియదు. రిలీజ్ డేట్ విషయంలో లేట్ జరగడం వల్లే ఈ సినిమాకు ఇలాంటి సమస్య వచ్చింది.
లేట్ అయినా పబ్లిక్ లో సినిమాపై హైప్ ను పెంచడానికి చిత్ర యూనిట్ ఏదీ చేయకపోవడం గమనార్హం. కేవలం నిఖిల్ ఒక్కడే ఇంటర్వ్యూలు చేస్తే హైప్ పెరగదు కదా. డైరెక్టర్ బ్రాండ్ పైన సినిమా నడుస్తుందా అంటే అది కష్టమే. ఆయన గత రెండు సినిమాలైన రావణాసుర(Ravanasura), శాకినీ డాకిని(Sakini Dakini) రెండూ ఫ్లాపులే. నవంబర్ 4న పెద్దగా పోటీ లేకపోవడమొక్కటే ఈ సినిమాకు ప్లస్.
పోటీ ఇచ్చే సినిమాలు లేకపోయినా క(KA), లక్కీ భాస్కర్(Lucky Baskhar), అమరన్(Amaran) సినిమాలు సెకండ్ వీక్ లో కూడా స్ట్రాంగ్ గా నిలబడేట్టున్నాయి. ఆ తర్వాత వారానికి కంగువ(Kanguva), మట్కా(matka), దేవకీ నందన వాసుదేవ(Devaki Nandana Vasudeva)లు రిలీజ్ కానున్నాయి. కాబట్టి రెండింటి మధ్య ఉన్న వారంలో ఈ సినిమా దిగడమనేది రిస్క్ అయినప్పటికీ చిత్ర యూనిట్ కు ఇప్పుడు మరో ఆప్షన్ లేదు. సినిమా బావుంటే ఓపెనింగ్స్ వీక్ గా ఉన్నా ఫైనల్ కలెక్షన్స్ కు ఎలాంటి ఢోకా ఉండదు.