ASBL NSL Infratech
facebook whatsapp X

టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతల స్వీకరణ

టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా నిర్మలా జగ్గారెడ్డి బాధ్యతల స్వీకరణ

తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ (టీజీఐఐసీ) చైర్‌పర్సన్‌గా తూర్పు నిర్మల జగ్గారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని ఐఐసీ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొన్న ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యేలు నాగరాజు, కవ్వంపల్లి సత్యనారాయణ, సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌, జయరెడ్డి, సీనియర్‌ నేతలు మధుయాస్కీ గౌడ్‌, సిరిసిల్ల రాజయ్య పాల్గొని ఆమెను అభినందించారు.  ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి పెద్ద ఎత్తున జగ్గారెడ్డి అభిమానులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :