ASBL NSL Infratech
facebook whatsapp X

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తో నితిన్ సినిమా

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ తో నితిన్ సినిమా

టాలెంట్ ఉండాలే కానీ ఎలాంటి చిన్న ప్రాజెక్ట్ తో అయినా త‌మ స‌త్తాను చాటొచ్చ‌ని నిరూపించాడు నైంటీస్ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన డైరెక్ట‌ర్ ఆదిత్య హాస‌న్. ఏదో చిన్న వెబ్ సిరీస్ గా వ‌చ్చిన ఈ ప్రాజెక్ట్ను పెద్ద హిట్ చేసి త‌న టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నాడు. అస‌లు ట్రాక్ లో లేని శివాజీని మెయిన్ రోల్ లో పెట్టి, త‌క్కువ బడ్జెట్ లో ఈ సిరీస్ ను తీశాడు ఆదిత్య‌.

సిరీస్ మొత్తంలో పేరున్న ఆర్టిస్టులు కూడా ఎవ‌రూ ఉండ‌రు. నిర్మాణ విలువ‌లు కూడా ఏమీ ఉండ‌వు. అలాంటి సిరీస్ ను కేవ‌లం కంటెంట్ తో హిట్ చేసి అంద‌రి మెప్పు పొంది ఆ సిరీస్‌ను మోస్ట్ ల‌వబుల్ వెబ్ సిరీస్ గా మార్చాడు ఆదిత్య‌. ఈ సిరీస్ త‌ర్వాత ఆదిత్య‌కు మంచి డిమాండ్ ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం నైంటీస్ మిడిల్ క్లాస్ సెకండ్ సీజ‌న్ తీస్తున్న ఆదిత్యకు సినిమా ఛాన్సులు కూడా బాగానే వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే యూత్ స్టార్ నితిన్ తో ఆదిత్య ఓ సినిమా చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం త‌మ్ముడు, రాబిన్ హుడ్ సినిమాల‌ను చేస్తున్న నితిన్, ఆదిత్య హాస‌న్ తో ఓ సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని తెలుస్తోంది. ఓ ప్ర‌ముఖ నిర్మాత ఈ సినిమాను నిర్మించ‌నున్న‌ట్లు స‌మాచారం. వెబ్ సిరీస్ తో త‌న స‌త్తా చాటిన ఆదిత్య సినిమాతో కూడా హిట్ అందుకుంటే టాలీవుడ్ లో బిజీ డైరెక్ట‌ర్ గా మార‌డం ఖాయం.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :