ASBL Koncept Ambience
facebook whatsapp X

సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్‌ ఈసీఓ భేటీ .. 2027 నాటికి

సీఎం చంద్రబాబుతో నీతి ఆయోగ్‌ ఈసీఓ భేటీ .. 2027 నాటికి

విజన్‌ డాక్యుమెంట్‌ 2047కు సంబంధించిన అంశాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో నీతి ఆయోగ్‌ సీఈఓ సుబ్రహ్మణ్యం సమావేశమై చర్చించారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ భేటీలో నీతి ఆయోగ్‌కు సంబంధించిన సలహాదారు, డైరెక్టర్లతో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ఏడాదికి 15 శాతం వృద్ధి రేటు సాధనే లక్ష్యంగా స్వర్ణాంధ్ర విజన్‌ డాక్యుమెంట్‌ 2047 ప్రణాళిక రూపొందించినట్లు చంద్రబాబు తెలిపారు.

2047 నాటికి 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా అంధ్రప్రదేశ్‌ అభివృద్ధే లక్ష్యంగా విజన్‌ డాక్యుమెంట్‌ను రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గాల స్థాయిలో రూపొందించినట్లు చంద్రబాబు తెలిపారు. వ్యవసాయం, ఆక్వా తదితర రంగాల్లో అభివృద్ధి సాధించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఎం నీతిఆయోగ్‌ సీఈఓకు వివరించారు. పేదిరిక నిర్మూలన, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెమోగ్రాఫిక్‌ మేనేజిమెంట్‌, డేటా సెంటర్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి గ్రోత్‌ ఇంజిన్లతో వృద్ధిరేటు సాధించేలా ఈ ప్రణాళికలు రూపొందాయని, వీటిని సమర్థంగా అమలు చేసే కార్యాచరణ చేసినట్లు చంద్రబాబు తెలిపారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :