టాలీవుడ్ లో నాని, కోలీవుడ్ లో శివ కార్తికేయన్
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా కష్టపడి మంచి పొజిషన్ వెళ్లిన వారిలో టాలీవుడ్ నుంచి అప్పట్లో చిరంజీవి(Chiranjeevi), రవితేజ(ravi teja) గుర్తొస్తే ఇప్పుడు మాత్రం నాని(Nani) గుర్తొస్తాడు. రాధా గోపాళం(radha Gopalam) సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, తర్వాత అష్టా చెమ్మా(Ashta chemma) సినిమాతో హీరోగా కెరీర్ ను స్టార్ట్ చేసిన నాని ఇప్పుడు దసరా(dasara), సరిపోదా శనివారం(Saripoda Sanivaram) సినిమాలతో ఏకంగా రూ.100 కోట్లు గ్రాస్ సాధించే స్థాయికి వెళ్లాడు.
టాలీవుడ్ లో నాని ఎలాగైతే కష్టపడి పైకొచ్చాడో కోలీవుడ్ లో శివ కార్తికేయన్(Siva Karthikeyan) కూడా అలానే కష్టపడి పైకొచ్చాడు. కెరీర్ స్టార్టింగ్ లో యాంకర్, సైడ్ ఆర్టిస్టుగా పని చేసిన శివ మొదట్లో చాలానే అప్ అండ్ డౌన్స్ చూశాడు. రీసెంట్ గా అతను నటించిన అమరన్(Amaran) సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ ను దాటే స్థాయికి ఇవాళ శివ చేరుకున్నాడు.
గతంలో ఈ మార్క్ ను టచ్ చేయాలంటే అతనికి ఎంతలేదన్నా పది రోజులు పట్టేది కానీ ఇప్పుడు చాలా ఈజీగా రికార్డులు నమోదు చేస్తున్నాడు. నాని, శివ కార్తికేయన్ కు ఉన్న కామన్ క్వాలిటీ కష్టపడే మనస్తత్వం. ఆ గుణమే వారిద్దరినీ అందలం ఎక్కిస్తోంది. గత కొన్నేళ్లుగా శివ నుంచి వచ్చిన సినిమాల్లో ఒక్క ప్రిన్స్(Prince) మాత్రమే నిరాశ పరిచింది. మిగిలిన అన్ని సినిమాలు కోలీవుడ్ లో కమర్షియల్ గా వర్కవుట్ అయినవే.