ASBL Koncept Ambience
facebook whatsapp X

పుష్ప‌2.. నో బ్రేక్స్!

పుష్ప‌2.. నో బ్రేక్స్!

ఎన్నో అంచ‌నాలున్న పుష్ప‌2 షూటింగ్ ఇప్ప‌టికీ పూర్తి కాలేదు. డిసెంబ‌ర్ 6న ఈ సినిమాను ఎట్టి ప‌రిస్థితుల్లో రిలీజ్ చేయాల‌ని డైరెక్ట‌ర్ సుకుమార్, హీరో అల్లు అర్జున్ యూనిట్ మొత్తాన్ని ప‌రుగులు పెట్టిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఫిల్మ్ సిటీలో రెండు యూనిట్లు, కాకినాడ‌లో మ‌రో యూనిట్ నిర్విరామంగా ప‌ని చేస్తున్నాయి. దీన్ని బ‌ట్టి పుష్ప‌2 వ‌ర్క్ ఏ రేంజ్ లో జ‌రుగుతుందో అర్థం చేసుకోవ‌చ్చు.

అక్టోబ‌ర్ లో పుష్ప‌2 ఐటెం సాంగ్ ను షూట్ చేయ‌నున్నార‌ట‌. ఇంకా ఆ సాంగ్ లో ఏ హీరోయిన్ క‌నిపించ‌నుంద‌నేది మాత్రం క్లారిటీ రాలేదు. న‌వంబ‌ర్ క‌ల్లా సినిమా ఫ‌స్ట్ కాపీని పూర్తి చేసి కుదిరితే సెన్సార్ కూడా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కు సుకుమార్ ఎంత టైమ్ కేటాయిస్తాడ‌నేదే ఇప్పుడు కీల‌కం కానుంది.

పుష్ప‌1 టైమ్ లో ఇదే స‌మ‌స్య. అందుకే దేవీ శ్రీ కి రీరికార్డింగ్ కోసం ఎక్కువ టైమ్ లేద‌ని ఆ సినిమా వ‌చ్చిన టైమ్ లో అన్నారు. కానీ ఇప్పుడ‌లా కాకూడ‌ద‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బిజినెస్ ప‌రంగా పుష్ప‌2 వెయ్యి కోట్లు టార్గెట్ పెట్టుకుంది. క‌ల్కి రికార్డుల‌ను దాటే స‌త్తా పుష్ప‌2 కి ఉంద‌ని బ‌య్య‌ర్లు చాలా ధీమాగా ఉన్నారు. ఇదిలా ఉంటే ఈసారి పుష్ప‌2 టీమ్ ప్ర‌మోష‌న్స్ ను చాలా గ‌ట్టిగా ప్లాన్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :