ASBL Koncept Ambience
facebook whatsapp X

సాయి ప‌ల్ల‌వి సినిమాకు సౌండ్ లేదేంటి?

సాయి ప‌ల్ల‌వి సినిమాకు సౌండ్ లేదేంటి?

ఈసారి దీపావ‌ళికి స్టార్ హీరోల సినిమాలు రాక‌పోయినా కంటెంట్ బేస్డ్ సినిమాలు పోటీలో ఉన్నాయి. ల‌క్కీ భాస్క‌ర్(Lucky Bhaskar), క(Ka) సినిమాల‌తో పాటూ అమ‌ర‌న్(Amaran) కూడా ఈ నెల 31నే రిలీజ్ కానున్నాయి. కానీ అమ‌ర‌న్ తెలుగు వెర్ష‌న్ కు ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టింది లేదు. రేపు ట్రైల‌ర్ లాంచ్ చేయ‌నున్నారు. అమ‌ర‌న్ లో సాయి ప‌ల్ల‌వి(sai pallavi) హీరోయిన్ అయిన‌ప్ప‌టికీ అమ్మ‌డికి ఉన్న ఫాలోయింగ్ ను వాడుకోవ‌డం లేదు చిత్ర యూనిట్.

సాయి ప‌ల్ల‌వి సినిమా దీపావ‌ళికి రిలీజ‌వుతుంద‌నే విష‌యం కూడా తెలియ‌కుండా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వేట్ట‌యాన్(vettayan) లానే ఈ సినిమాను కూడా య‌ధాత‌థంగా అమ‌ర‌న్ అనే పేరుతోనే రిలీజ్ చేస్తున్నారు. అయితే అమ‌ర‌న్ ఫోక‌స్ మొత్తం త‌మిళ‌నాడు పైనే ఉంది. మేజ‌ర్ ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ జీవిత క‌థ ఆధారంగా ఈ సినిమా రూపొందింది.  

రాజ్ కుమార్ పెరియ‌స్వామి(raj kumar periyaswami) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా తెలుగు ప్ర‌మోష‌న్స్ పై శివ కార్తికేయ‌న్(Siva Karthikeyan) స్పెష‌ల్ ఫోక‌స్ చేయ‌నున్నాడు. త‌న సినిమాలు డాక్ట‌ర్(doctor), డాన్(Don) తెలుగులో మంచి స‌క్సెస్ సాధించిన కార‌ణంగా అమ‌ర‌న్ ను గ‌ట్టిగా ప్ర‌మోట్ చేయాల‌ని శివ కార్తికేయ‌న్ డిసైడ‌య్యాడ‌ట‌. కంటెంట్ బావుంటే తెలుగు ఆడియ‌న్స్ ఆ సినిమాను నెత్తిన పెట్టుకుంటార‌ని తెలుసుకున్న శివ కార్తికేయ‌న్ ఈ సినిమాపై ఎంతో న‌మ్మ‌కంగా ఉన్నాడు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :