ఉక్రెయిన్ దాడి వేళ కీలక పరిణామం
ఉక్రెయిన్‌పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు సైనిక సహాయం అందిస్తున్న ఉత్తర కొరియా ఆ దేశానికి మరిన్ని ఆయుధాలను పంపించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా తాజాగా వెల్లడించింది. ఇటీవల అమెరికా తయారీ క్షిపణులను రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించిన అనంతరం ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల అదనపు ఫిరంగి వ్యవస్థను కిమ్ ప్రభుత్వం అందజేసిందని దక్షిణ కొరియా తెలిపింది. రష్యాలో మోహరించిన కిమ్ సేనలో వేలాది మంది యుద్ధంలో పోరాడుతున్నట్లు తెలిపింది. తాజాగా 170 గన్‌లు, 240 రాకెట్లను తరలించినట్లు వెల్లడిరచింది. ఈ ఆయుధాలను వాడే సామర్థ్యం మాస్కో సైనికులకు లేదని, వారికి శిక్షణ ఇచ్చేందుకు ఉత్తర కొరియా నుంచి సిబ్బంది అక్కడి వెళ్లినట్లు తెలిపింది.
Tags :