ASBL Koncept Ambience
facebook whatsapp X

స్నేహితులు అందరిదీ ఒకటే మాట : మరిచి పోలేని వ్యక్తి గోకుల్

స్నేహితులు అందరిదీ ఒకటే మాట : మరిచి పోలేని వ్యక్తి గోకుల్


సాధారణంగా మరణానంతరం కుటుంబ సభ్యులు ఏర్పాటుచేసిన ఫంక్షన్ లో అందరూ వచ్చి నివాళులు అర్పించి సంతాపం చెపుతారు. లేదా ఒక నాయకుడు వెళ్ళిపోతే ఆ పార్టీ వాళ్ళు సంతాన సభ నిర్వహిస్తారు. కాని స్నేహితులే ఒక బృందం గా ఏర్పడి సంతాప కార్యక్రమం లాగా కాకుండా.. ఒక మెమరీ రికలెక్షన్ మీటింగ్ ఏర్పాటుచేయడం, ఆ సభ కు బే ఏరియా లో అనేక మంది రావడం స్వర్గీయ గోకుల్ రాచిరాజు కు వున్న స్నేహ లక్షణం తెలియ చేస్తోంది. అలాగే మొదట లోనే నిర్వాహక బృందం నుంచి శ్రీ వీర బాబు మాట్లాడుతూ ఎవ్వరూ బాధ తో కాకుండా గోకుల్ తో తమ అనుభవాలు సంతోషంగా చెప్పుకొంటూ, ఆయన కు ఇష్టమైన రీతి లో ఈ సభ నడుపుదాము అని చెప్పటం ఎప్పుడూ అందరితో సరదాగా జోవియల్ గా వుండే గోకుల్ పర్సనాలిటీ ని గుర్తు చేసింది. గోకుల్ కి ఇష్టమైన వంటకాలు ప్రత్యేకంగా చేయించాము - తెప్పించాము అని చెప్పటం, అందరూ తృప్తి గా భోజనం చేసి సంతోషం గా వెళ్ళండి అని పదే పదే చెప్పటం గోకుల్ మీద మిత్రులకున్న అభిమానం చెపుతున్నాయి.

వీర బాబు మాట్లాడుతూ గోకుల్ తో తన గాఢ స్నేహాన్ని గుర్తు చేసుకొన్నారు. భరత్ ముప్పిరాల మాట్లాడుతూ తన ప్రియ మిత్రుడు గోకుల్ రాచిరాజు తనకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి ఎలా సలహాలు ఇచ్చే వాడో గద్గద స్వరంతో చెప్పారు. జె పీ వేజెండ్ల మాట్లాడుతూ క్యాన్సర్ వచ్చిందని తెలిసిన రోజు నుంచి మొదటి వారం లో ట్రీట్మెంట్ మొదలెట్టాక గోకుల్ ప్రతి రోజూ పంపిన ఆడియో మేసేజ్ లు వినిపించి గోకుల్ ఎంత పాజిటివ్ ఉండేవారో అందరికీ వివరించారు. గోకుల్ బావ సుబ్రమణ్యం మాట్లాడుతూ గోకుల్ బంధువులతో ఎంత కలిసి మెలిసి ఉండేవారో వివరించారు. చిమట శ్రీనివాస్ మాట్లాడుతూ గోకుల్ తో తన అనుబంధం ఎక్కువగా తెలుగు భాష గురించి అని చెప్పారు. సుబ్బా యంత్ర మాట్లాడుతూ గోకుల్ MBA స్టూడెంట్ గా తనకు పరిచయం అయ్యాడని చెప్పారు. వెంకట్ అడుసుమిల్లి మాట్లాడుతూ గోకుల్ అసలు ఏ మాత్రం పరిచయం కూడా లేని ఒక స్టూడెంట్ కి ఏ విధంగా సలహాలు ఇచ్చి సహాయం చేశారో వివరించారు. సుబ్బారావు చెన్నూరి మాట్లాడుతూ తెలుగు టైమ్స్, పాఠశాల కి సంబంధించిన అనేక విషయాలు గోకుల్ తో చర్చించే వాడినని తెలిపారు.

ముందుగా ప్రసాద్ మంగిన, తిరు గుడివాడ, యోగేష్ గోకుల్ కి ఇష్ట మైన పాటలు పాడి గోకుల్ ని గుర్తు చేసుకొన్నారు. తరువాత అందరూ మంచి భోజనం చేసి గోకుల్ కబుర్లు చెప్పుకొన్నారు.

వీరు ఉప్పాల, రమేష్ కొండా, కళ్యాణ్ కట్టమూరి, శాస్త్రి వెనిగేళ్ల,  వెంకట్ కోగంటి, పైలా జోగినాయుడు, హరి సన్నిది, లియోన్ రెడ్డి, సాగర్ దొడ్డపనేని, రవి కిరణ్ ఏలేటి, వెంకట్ మద్దిపాటి, రామ దాసు పులి, కిరణ్ విన్నకోట, హేమ రావు నందిపాటి, రామ్ తోట, సురేష్ రెడ్డి, ఏం డి. కుద్రస్ తదితర స్నేహితులు పాల్గొన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :