CBN: డే విత్ సీబీఎన్‌లో చంద్రబాబుతో ఎన్నారై ఉన్నం నవీన్‌కుమార్
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం స్వీడన్ నుంచి వచ్చిన ఐదు నెలలపాటు క్షేత్రస్థాయిలో పనిచేసిన ఎన్నారై ఉన్నం నవీన్‌కుమార్ (Naveen Kumar )ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గౌరవించారు. ఉండవల్లి నివాసానికి ఆయన్ను ఆహ్వానించి రోజంతా తనతో ఉండే అవకాశాన్ని కల్పించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎలాంటి లాభాపేక్ష లేకండా పనిచేసిన ఎన్నారైల కృషి స్ఫూర్తిదాయకమని నవీన్‌ను అభినందించారు. ఈ సందర్భంగా సీఎం నిర్వహించిన పలు సమీక్షల్లో నవీన్ పాల్గొన్నారు.
టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పని చేశారు. ఈ క్రమంలో కుప్పం, శ్రీకాళహస్తి, సూళ్లూరు పేట, చంద్రగిరి నియోజకవర్గాల్లో నవీన్ పనిచేశారు. సుమారు 1800 మంది ప్రభావశీల వ్యక్తులతో ఫోన్‌లో మాట్లాడారు. కష్టపడి పనిచేసి, అత్యుత్తమ ప్రతిభకనబరిచిన ఎన్నారైలకు చంద్రబాబు (Chandrababu) తో ఒక రోజంతా ఉండే అవకాశం కల్పిస్తామని ( డే విత్ సీబీఎన్) గతంలో హామీ ఇచ్చారు. అందుకే నవీన్‌కు అవకాశం కల్పించాం అని టీడీపీ ఎన్నారై అధ్యక్షుడు వేమూరి రవి(Vemuri Ravi) తెలిపారు.