ASBL Koncept Ambience
facebook whatsapp X

అన్నివర్గాలకు సమన్యాయం చంద్రబాబు ధ్యేయం : న్యూ జెర్సీలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 

అన్నివర్గాలకు సమన్యాయం చంద్రబాబు ధ్యేయం : న్యూ జెర్సీలో ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు 

కూటమి ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్  రాష్ట్రాభివృద్ధి శరవేగంగా జరుగుతుందని ఏపీ  శాసన స్పీకర్  అయ్యన్నపాత్రుడు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా  ముఖ్యమంత్రి చంద్రబాబు సారధ్యంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తోందని అన్నారు. న్యూ జెర్సీ లోని ఫైవ్ స్పైస్ ప్యాలస్ లో అయ్యన్న తో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని న్యూ జెర్సీ కూటమి నేతలు ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్ ఆర్ ఐ లు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన ఉల్లాసంగా సమాధానాలు ఇచ్చారు.ఏదైనా కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలానికి గాని ప్రజల్లోకి వెళ్లే ధైర్యం చేయరని, కాని కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలనలోనే ఎంతో అభివృద్ధి సాధించి ధైర్యంగా ప్రజల ముందుకు వచ్చిందన్నారు.స్వర్ణాంధ్ర-2047 లక్ష్యసాధనలో ఎన్ఆర్ ఐ లు భాగస్వామ్యమై ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

విభజన గాయాల నుంచి కోలుకునే దశలో మాజీ సీఎం జగన్ చేసిన విధ్వంసం నుంచి బయటపడడానికి సర్వశక్తులూ కూడగట్టుకొని సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని గదిలో పెట్టేందుకు పనిచేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాలు, ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి ధ్యేయం గా ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ రూపొందించారని వెల్లడించారు.

తాను ఎన్టీఆర్ డిస్కవరీ అని అయ్యన్న చెప్పుకున్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చి తనలాంటి వారిని ఎంతో మందిని తెచ్చారని అలా తనకు కూడా చిన్న వయసులోనే రాజకీయ బిక్ష పెట్టింది ఎన్టీఆర్ అని అయ్యన్న గతాన్ని నెమరేసుకున్నారు. తాను టీడీపీలో ఈ రోజు ఉన్నాను అంటే అది ఎన్టీఆర్ దయ అని క్రెడిట్ అంతా పెద్దాయనకు ఇచ్చేసారు.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినపుడు ఎంతో మంది ఆయనని విమర్శించారని  రాజకీయాల్లో ఆయన రాణించరు అని కూడా అన్నారని.. కానీ తాను ఎన్టీఆర్ సక్సెస్ అవుతారని ఊహించాను అని కూడా అయ్యన్న అన్నారు. ఏపీలో కూటమి కి మద్దతు పలికిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమ నిర్వాహకులను అభినందించారు. రాజ కసుకుర్తి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రామకృష్ణ వాసిరెడ్డి  వందన సమర్పణ చేశారు.

ఈ కార్యక్రమంలో న్యూ జెర్సీ కూటమి నేతలు సతీష్ మేకా, నాయుడు ఈర్ల, హరి ముత్యాల, శ్రీహరి మందాడి, రమేష్ నూతలపాటి, జగదీష్ యలమంచలి, శ్రీనివాస్ ఓరుగంటి, లక్ష్మి దేవినేని, హరి తుమ్మల, రమణ గన్నే, రవి వట్టికూటి, వంశీ వెనిగండ్ల పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :