జయరాంకోమటి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు
బే ఏరియాలో ఎన్నారై టీడీపీ నాయకుడు జయరాం కోమటి ఆధ్వర్యంలో యుగపురుషుడు ఎన్టీఆర్ 101వ జయంతి ఉత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పలువురు హాజరై ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులు అర్పించారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయంకోసం బే ఏరియా నుంచి ఎంతోమంది ఎన్నారైలు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్ళి వారివారి నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేసి వచ్చారు. జయరాం కోమటి, వెంకట్ కోగంటి, భక్త భల్లా తమ అనుభవాలను వచ్చినవారితో పంచుకున్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, జయరాం కోమటి, వెంకట్ కోగంటి, భక్త భల్లా, సతీష్ అంబటి, సుబ్బ యంత్ర, శ్రీనివాస్ వల్లూరిపల్లి, విజయ్ గుమ్మడి, హరి సన్నిధి, వెంకట్ అడుసుమల్లి, లియోన్ రెడ్డి బోయపాటి, వెంకట్ మద్దిపాటి, సుధీర్ ఉన్నం, వెంకట్ జెట్టి, భరత్ ముప్పిరాళ్ళ, రవి కిరణ్, నరహరి మార్నేని, హరి బాబు బొప్పూడి, వంశీ కృష్ణ నేలకుదిటి, రామ్మోహన్ తదితరులు పాల్గోన్నారు.