ASBL Koncept Ambience
facebook whatsapp X

జాన్వీకి తార‌క్ ఎలివేష‌న్లు

జాన్వీకి తార‌క్ ఎలివేష‌న్లు

జాన్వీ క‌పూర్ టాలీవుడ్ ఎంట్రీపై స‌గ‌టు ప్రేక్ష‌కుల‌తో పాటూ ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో కూడా విప‌రీత‌మైన ఆస‌క్తి నెల‌కొంది. హీరోయిన్లు కొర‌త ఎక్కువ‌గా ఉండ‌టంతో జాన్వీ మంచి పేరు తెచ్చుకుంటే ఆమె ఓ ఛాయిస్ అవుతుంద‌నే ఆశ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లో ఉంది. దేవ‌ర రిలీజ్ కు ముందే రామ్ చ‌ర‌ణ్ 16కి ఎంపిక అవ‌డం అమ్మ‌డి క్రేజ్ ను మ‌రింత పెంచింది.

ఇదిలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో జూ. ఎన్టీఆర్, జాన్వీ గురించి చెప్పిన విష‌యం అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. షూటింగ్ స్పాట్ లో రెండు పేజీల డైలాగుని సింగిల్ టేక్ లో ఏక‌ధాటిగా చూసి యూనిట్ మొత్తం షాకైంద‌ని, వెంనే కొర‌టాలను ఈ షాట్ ఓకే చేసేయ‌మని వెనుక నుంచి తార‌క్ చెప్పాడ‌ట‌. అప్ప‌టివ‌ర‌కు జాన్వీ న‌ట‌న‌ని చూస్తుండిపోయిన కొర‌టాల వెంట‌నే ఈ లోకంలోకి వ‌చ్చి క‌ట్ చెప్పాడ‌ని ఎన్టీఆర్ తెలిపాడు.

అయితే ఈ సీన్ ఏంట‌నేది చెప్ప‌లేదు కానీ సీన్ ఏదైనా కానీ ఎమోష‌న్ మాత్రం ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఇన్‌సైడ్ టాక్ ప్ర‌కారం జాన్వీకి సెకండాఫ్ లో వ‌చ్చే కీల‌క స‌న్నివేశంలో మంచి ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఉన్నాయ‌ని తెలుస్తోంది. ఎన్టీఆర్ చెప్పింది దాని గురించేన‌ని టాక్. శ్రీదేవి వార‌సురాలిగా టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న జాన్వీ ఇక్క‌డ మంచి హిట్ కొట్టి న‌టిగా నిరూపించుకుంటే ఇక తిరిగి నార్త్ కు వెళ్లే ప‌నే ఉండ‌దు.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :