ASBL Koncept Ambience
facebook whatsapp X

ఎన్టీఆర్ బాలీవుడ్ ప్లానింగ్ అదుర్స్

ఎన్టీఆర్ బాలీవుడ్ ప్లానింగ్ అదుర్స్

ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ క్రేజ్, మార్కెట్ బాగా పెరిగాయ‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ విషయం వారి త‌ర్వాతి సినిమాల విష‌యంలో చాలా క్లియ‌ర్ గా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆర్ఆర్ఆర్ త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి దేవ‌రకు పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ ఏర్ప‌డింది. ఓపెనింగ్స్ కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయ‌ని అర్థ‌మ‌వుతుంది.

ఇదిలా ఉంటే తార‌క్ త‌న మార్కెట్ ను పాన్ ఇండియా స్థాయిలో మ‌రింత విస్త‌రించేలా ప్లాన్ చేసుకుని దానికి త‌గ్గ‌ట్టు అడుగులేస్తున్నాడు. ప్ర‌శాంత్ నీల్ తో సినిమాను లైన్ లో పెట్టిన తార‌క్, బాలీవుడ్ లో హృతిక్ రోష‌న్ తో క‌లిసి వార్2 చేస్తున్నాడు. అయితే ప్ర‌స్తుతం ఎన్టీఆర్ నుంచి రానున్న దేవ‌ర సినిమాను కూడా ఎన్టీఆర్ హిందీలో రిలీజ్ చేస్తున్నాడు.

అంతేకాదు క‌ర‌ణ్ జోహార్ సైతం ఎన్టీఆర్ తో డైరెక్ట్ హిందీ సినిమా చేయ‌డానికి రెడీ అవుతున్న‌ట్లు తెలుస్తోంది. తార‌క్ త‌న‌కు బాగా క్లోజ్ అని, త‌మ జ‌ర్నీ ఇప్పుడే మొద‌లైంద‌ని, ముందుముందు చాలా చూస్తార‌ని చెప్తూ, తాను ఏ విష‌యం గురించి మాట్లాడుతున్నానో తార‌క్ కు కూడా తెలుస‌ని త‌మ కాంబోలో రానున్న సినిమా విష‌యం గురించి క‌ర‌ణ్ జోహార్ దేవ‌ర ట్రైల‌ర్ లాంచ్ లో చెప్పాడు. క‌ర‌ణ్ ప్రొడ‌క్ష‌న్ లో ఎన్టీఆర్ సినిమా అంటే బాలీవుడ్ షేక‌వ‌డం ఖాయమ‌ని అప్పుడే ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ త‌న కెరీర్ ను ప్లాన్ చేసుకున్న విధానం అందరినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :