ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవ‌ర కోసం ఎన్టీఆర్ ఎంత తీసుకుంటున్నాడంటే..

దేవ‌ర కోసం ఎన్టీఆర్ ఎంత తీసుకుంటున్నాడంటే..

నిన్ను చూడాల‌ని సినిమాతో వెండితెరకు ప‌రిచ‌మైన జూ. ఎన్టీఆర్ ఆ త‌ర్వాత స్టూడెంట్ నెం.1 సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు. చిన్న వ‌య‌సులోనే భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ త‌ర్వాత ప‌లు సినిమాలు చేసి ఆడియ‌న్స్ ను అల‌రించాడు. మ‌ధ్య‌లో త‌న నుంచి వ‌చ్చిన శ‌క్తి, ద‌మ్ము, ఊస‌ర‌వెల్లి, రామ‌య్యా వ‌స్తావ‌య్యా, ర‌భ‌స సినిమాలు ఫ్లాపుల‌య్యాయి.

మ‌ళ్లీ టెంప‌ర్ తో ఫామ్ లోకి వ‌చ్చిన ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ తో పాన్ ఇండియా స్థాయిలో భారీ స‌క్సెస్ అందుకున్న త‌న క్రేజ్ ను పెంచుకున్నాడు. ఇప్పుడు ఎన్టీఆర్, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో దేవ‌ర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. మొద‌టి భాగం దేవ‌ర‌1 సెప్టెంబ‌ర్ 27న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్ చేస్తున్న ఈ సినిమాకు త‌ను తీసుకున్న రెమ్యూన‌రేష‌న్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైర‌లవుతోంది. దేవ‌ర సినిమాకు ఎన్టీఆర్ భారీగా ఛార్జ్ చేశాడ‌ని, ఇంత‌కుముందు కంటే త‌న పారితోషికాన్ని 33% పెంచాడ‌ని అంటున్నారు. ఆర్ఆర్ఆర్‌కు ఎన్టీఆర్ రూ.45 కోట్లు తీసుకున్నాడ‌ని, ఇప్పుడు దేవ‌ర‌కు రూ.60 కోట్లు తీసుకుంటున్నాడ‌ని వార్త‌లొస్తున్నాయి. అయితే ఇందులో నిజ‌మెంత‌న్న‌ది తెలియాల్సి ఉంది. భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన దేవ‌ర‌తో మ‌రి ఎన్టీఆర్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.  

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :