ASBL Koncept Ambience
facebook whatsapp X

దేవ‌రను ప్ర‌మోట్ చేయ‌నున్న బ‌న్నీ?

దేవ‌రను ప్ర‌మోట్ చేయ‌నున్న బ‌న్నీ?

కొర‌టాల శివ, ఎన్టీఆర్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన దేవ‌ర1 మ‌రో 18 రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ వేగాన్ని పెంచింది. రేపు ట్రైల‌ర్ లాంచ్ కోసం ముందుగానే ముంబై వెళ్లిన తార‌క్ ఆ త‌ర్వాత బాలీవుడ్ మీడియాకు వ‌రుసపెట్టి ఇంట‌ర్వ్యూలు ఇవ్వ‌నున్నాడు. వార్2లో హృతిక్ తో క‌లిసి న‌టిస్తున్న నేప‌థ్యంలో బాలీవుడ్ లో తార‌క్ మీద ఓ రేంజ్ లో అంచ‌నాలున్నాయి.

అయితే ఆ అంచ‌నాల‌ను అందుకోవ‌డానికి దేవ‌ర‌1తో మంచి స‌క్సెస్ కొట్టాల‌ని చూస్తున్నాడు ఎన్టీఆర్. దేవ‌ర‌1 క‌చ్ఛితంగా బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. దానికి త‌గ్గ‌ట్టే సినిమాను కూడా డిఫ‌రెంట్ గా ప్ర‌మోట్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలోనే దేవ‌ర మేక‌ర్స్ జూనియ‌ర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ మ‌ధ్య ఓ స‌ర‌దా ఇంట‌ర్వ్యూని ప్లాన్ చేసిన‌ట్లు స‌మాచారం.

ఒక‌రినొక‌రు ప్రేమ‌గా బావా బావా అని పిలుచుకునే వీరు ఆఫ్ లైన్ లో ఎలా ఉంటారో ఫ్యాన్స్ కు తెలియ‌చెప్ప‌డంతో పాటూ బ‌న్నీతో ఇంట‌ర్వ్యూ చేయిస్తే దేవ‌ర‌కు మ‌రింత అటెన్ష‌న్ పెరుగుతుంద‌ని ఇలా ప్లాన్ చేశార‌ట‌. బ‌న్నీ డేట్స్ ను బ‌ట్టి ఏదొక రోజు ఈ ఇంట‌ర్వ్యూని ప్లాన్ చేయాల‌ని చూస్తున్నార‌ట‌. దీంతో పాటూ మ‌రికొన్ని విభిన్న ప‌బ్లిసిటీ స్టంట్స్ ను కూడా దేవ‌ర టీమ్ ప్లాన్ చేస్తుంది.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :