ASBL Koncept Ambience
facebook whatsapp X

కోలీవుడ్ ఎంట్రీపై తార‌క్ రియాక్ష‌న్

కోలీవుడ్ ఎంట్రీపై తార‌క్ రియాక్ష‌న్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు తెలుగులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ ను త‌మిళ ఆడియ‌న్స్ కూడా ఓన్ చేసుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు త‌మిళంలో మంచి రెస్పాన్స్ రావ‌డంతో, ఎన్టీఆర్ నుంచి రాబోతున్న దేవ‌ర‌కు అంత‌కుమించి రెస్పాన్స్ వ‌స్తుందని అంద‌రూ అనుకుంటున్నారు.

అయితే దీనికి కార‌ణం లేక‌పోలేదు. ఎన్టీఆర్ త‌మిళ డైరెక్ట‌ర్లు చెప్పే క‌థ‌ల‌ను ఎక్కువ‌గా లైక్ చేస్తుంటాడు. ఈ నేప‌థ్యంలోనే ఎన్టీఆర్ తో అట్లీ, వెట్రిమార‌న్ లాంటి డైరెక్ట‌ర్లు సినిమాలు చేస్తార‌నే ప్ర‌చారం జరిగింది. గ‌తంలో ఈ ఇద్ద‌రు డైరెక్ట‌ర్లు ఎన్టీఆర్ కు క‌థ‌లు కూడా నెరేట్ చేశార‌ని టాక్. కోవిడ్ కు ముందు వెట్రిమార‌న్, ఎన్టీఆర్ కు క‌థ చెప్పాన‌ని, స్టోరీ ఎన్టీఆర్ కు న‌చ్చిన‌ప్ప‌టికీ అత‌ని వ‌రుస క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల సినిమా చేయ‌డానికి లేట‌వుతుంద‌ని చెప్పారు.

ఇదిలా ఉంటే తాజాగా దేవ‌ర ప్రమోష‌న్స్ లో భాగంగా చెన్నైకు వెళ్లిన ఎన్టీఆర్ కు త‌మిళంలో ఎప్పుడు స్ట్రైట్ మూవీ చేస్తార‌నే ప్ర‌శ్న ఎదురైంది. దానికి ఎన్టీఆర్ స‌మాధాన‌మిస్తూ నా ఫేవ‌రెట్ డైరెక్ట‌ర్ వెట్రిమార‌న్ స‌ర్ నాతో ఎప్పుడు సినిమా చేస్తానంటే అప్పుడు నేను త‌మిళంలో సినిమా చేస్తాన‌ని, డైరెక్ట్ తమిళంలో చేసి తెలుగులో డ‌బ్ చేద్దామంటూ స్టేజ్ పై నుంచే ఎన్టీఆర్, వెట్రిమార‌న్‌కు రిక్వెస్ట్ పెట్టాడు. మ‌రి దీనిపై వెట్రిమార‌న్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. వీరిద్ద‌రి కాంబోలో సినిమా వ‌స్తే పాన్ ఇండియా లెవెల్ లో ఆ సినిమాకు హైప్ రావ‌డం ఖాయం.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :