ఘనంగా ఎన్ వై టిటిఎ Nytta వినాయకచవితి ఉత్సవం
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (ఎన్ వై టిటిఎ) ఆధ్వర్యంలో వినాయకచవితి వేడుకలను సెల్డన్ Selden లోని హిందూ టెంపుల్లాంగ్ ఐలాండ్ long island న్యూయార్క్ లో ఘనంగా జరిపారు. నవరాత్రులు నిర్వహించిన ఈ పూజలో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు పూజ కార్యక్రమాలను జరుపుకొని, ప్రత్యేకంగా ఒక రోజు కిడ్స్ చే గణేశ పూజ జరిపించి, వారికీ గణేశ ప్రతిమతో పాటు బుక్స్ పెన్సిల్స్ అంద చేయడం జరిగింది. ఈ సందర్బంగా పూజ లో పాల్గొన్న చిన్నారులు వారి పేరెంట్స్ ఎంతో ఆనందాన్ని వ్యక్త పర్చడం జరిగింది. ప్రతి రోజు నైవేద్యం, ప్రసాదాన్ని భక్తులకి పంచడం జరిగింది. ఈ నవరాత్రుల సందర్బంగా వినాయకుడి స్వామి వారి లడ్డుకి వేలం నిర్వహించగా వచ్చిన మనీ ని టెంపుల్ డెవలప్మెంట్ మరియు అనాధ ఆశ్రమం కొరకు వెచ్చించిడం జరుగుతుంది అని ప్రెసిడెంట్ వాణి సింగిరికొండ తెలియజేశారు. న్యూయార్క్ నగరంలోని ప్రముఖులు రోజు వారి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోకల్ ఫిలాంత్రపిస్ట్, వ్యాపారవేత్త ఎన్ వై టిటిఎ శ్రేయోభిలాషి డా. పైళ్ళ మల్లా రెడ్డి దంపతులు పూజలో పాల్గొనడం జరిగింది.
నవరాత్రుల పదవ రోజు ప్రత్యేక పూజ జరుపుకొని ఉత్సవ వినాయకుడి ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి తదుపరి భక్తుల కోలాహలం మద్య ఎంతో ఉల్లాసభరితంగా, ఆనందోత్సవాలతో నిమజ్జనం కార్యక్రమాన్ని లిడో బీచ్ లో జరుపుకోవడం ద్వారా ఈ సంహత్సరం వినాయకుడికి వీడుకోలు జరపడం జరిగింది.
ఈ సందర్బంగా ప్రెసిడెంట్ వాణి మాట్లాడుతూ వినాయక చవితి సంబరాలను ఎంతో ఘనంగా జరుపుకోవడానికి సహకరించిన సహచర కార్యవర్గానికి, బోర్డు అఫ్ డైరెక్టర్స్, అడ్వైసర్స్ మరియు టెంపుల్ నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు మరీముఖ్యంగా ప్రతి రోజు పూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తు తుది నిమజ్జనం వరకు సహకరించిన పూజారి శ్రీ వేద వ్యాస్ గారికి ప్రత్యేక ధన్యవాదములు చెప్పారు.