ASBL Koncept Ambience
facebook whatsapp X

స‌మంత ముఖంలో పాత క‌ళ‌

స‌మంత ముఖంలో పాత క‌ళ‌

సౌత్ లో తిరుగులేని ఇమేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించిన హీరోయిన్ల‌లో స‌మంత(samantha) కూడా ఒక‌రు. ఆమె విజ‌యశాంతి(Vijayasanthi), న‌య‌న‌తార‌(nayanthara), అనుష్క(Anushka) లాగా ప‌వ‌ర్‌ఫుల్ మాస్ రోల్స్ చేయ‌క‌పోయినా క్లాస్ సినిమాలు చేస్తూనే భారీగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. స్టార్ హీరోల సినిమాల్లో గ్లామ‌ర్, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేస్తూనే యూట‌ర్న్(Uturn), ఓ బేబీ(Oh Baby), య‌శోద(Yashoda) లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తో కూడా ఆక‌ట్టుకుంది.  

అయితే ఎలాంటి హీరోయిన్ కైనా కొన్నాళ్ల త‌ర్వాత ఛాన్సులు త‌గ్గ‌డం, కెరీర్ డౌన్ అవ‌డం మామూలే. దానికి తోడు స‌మంత పెళ్లి చేసుకోవ‌డంతో త‌న కెరీర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఆమె త‌ర్వాత కూడా బ‌లంగా నిల‌బ‌డింది. కానీ వ్య‌క్తిగ‌త జీవితం, అనారోగ్యం కూడా స‌మంత కెరీర్ పై ఎఫెక్ట్ చూపించాయి. దీంతో సామ్ లుక్ కూడా మారిపోయింది.

స‌మంత‌లో ఒక‌ప్ప‌టి ఛార్మ్ మిస్ అయింద‌నే ఫీలింగ్ అంద‌రికీ క‌లిగింది. శాకుంత‌లం(Saakunthalam) డిజాస్ట‌ర్ కావ‌డం, ఆ త‌ర్వాత కెరీర్లో గ్యాప్ కూడా రావ‌డం త‌న కెరీర్ పై ప్ర‌తికూల ప్ర‌భావం చూపేలా క‌నిపించింది. ఇక స‌మంత కెరీర్ ముగిసిన‌ట్లే అనుకున్నారు. కానీ ఇప్పుడు స‌మంత సిటాడెల్(Citadel) తో కంబ్యాక్ ఇవ్వాల‌ని చూస్తుంది. ఈ సిరీస్ ప్ర‌మోష‌న్స్ లో స‌మంత చాలా ఎట్రాక్ట్ గా క‌నిపిస్తోంది. స‌మంత ఫేస్ లో మునుప‌టి ఛార్మింగ్ ఇప్పుడు క‌నిపిస్తుంది. లుక్ కూడా చాలా బాగుంది. ఈ లుక్ లో స‌మంతను చూసి ఫ్యాన్స్ తెగ సంబర‌ప‌డిపోతున్నారు. 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :