ASBL NSL Infratech
facebook whatsapp X

డల్లాస్ లో వీఎన్ ఆదిత్య మూవీ ఆడిషన్స్  

డల్లాస్ లో వీఎన్ ఆదిత్య మూవీ ఆడిషన్స్  


టాలీవుడ్ లో మనసంతా నువ్వే, నేనున్నాను వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వీఎన్ ఆదిత్య తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన కొన్ని సినిమాలు రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. ఇక ఈ క్రమంలో వీఎన్ ఆదిత్య డైరెక్షన్ లో త్వరలో ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ కాబోతుంది.

ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ అనే కొత్త నిర్మాణ సంస్థ నుండి ఈ ప్రాజెక్ట్ రానుండగా.. డాక్టర్ మీనాక్షి అనిపిండి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమా కోసం జూలై 7న అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ నగరంలో లాకింట బంకేట్ హాల్లో నిర్మహించిన ప్రెస్ మీట్ లో ఈ సినిమా అనౌన్స్ మెంట్ చేశారు. అయితే సినిమాకు సంబంధించి తాజాగా ఓఎంజీ ప్రొడక్షన్ హౌస్ ఆడిషన్స్ నిర్వహించింది.

ఈ ఆడిషన్స్ లో ప్రవాస భారతీయులతో పాటు విదేశీయులు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. దేశం కాని దేశంలో ఓ తెలుగు సినిమా ఆడిషన్ కి ఇంతటి రెస్పాన్స్ రావడంపై మేకర్స్ హర్షం వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన డల్లాస్ మూవీ బఫ్స్ వాట్సప్ గ్రూప్, డల్లాస్ ప్రొడ్యూసర్స్ వాట్సప్ గ్రూప్, ఫేస్ బుక్ పేజెస్ అడ్మిన్స్ కి మేకర్స్ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :