ASBL NSL Infratech

అమెరికాలో భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఇళ్లు

అమెరికాలో భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఇళ్లు

ఎడతెరిపి కురుస్తున్న భారీ వర్షాలతో అమెరికాలో అయోవా రాష్ట్రం అతలాకుతలమైంది. వర్షపు నీటిలో మునిగి రహదారులు కనిపించకుండాపోయాయి. ఇళ్లు నీట మునగడంతో జనం సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. జలదిగ్బందంలో చిక్కుకుపోయిన వారిని హెలికాప్టర్ సాయంతో రక్షించేందుకు ప్రభుత్వం రంగంలోకి దిగింది. పడవల్లో జనాలను వేరే చోటకు తరలిస్తున్నారు. అయెవా  రాష్ట్రంలోని సియాక్స్ కౌంటీలోని రాక్వ్యాలీ జనావాసం మొత్తం జలమయమైంది. 21 కంటీల్లో అత్యవసర పరిస్థితి విధించారు. సౌత్ డకోటాలోనూ భీకర వర్షాలు కురుస్తున్నాయి. ఆగ్నేయ సియాక్స్ ఫాల్స్ సమీపంలో కాన్టన్ పట్టంలో ఏకంగా 45.72 సెంటీమీటర్ల  వర్షపాతం నమోదైంది. దీంతో హైవేలపై రాకపోకలను పోలీసులు ఆపేశారు. మిన్నెసోటాలోనూ రాష్ట్ర రహదారులను మూసేశారు. 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :