ASBL Koncept Ambience
facebook whatsapp X

సినీ ఇండస్ట్రీలో ఇలా జరగడానికి ఓటీటీ లే కారణం.. అసలు గుట్టు విప్పిన దర్శకుడు..

సినీ ఇండస్ట్రీలో ఇలా జరగడానికి ఓటీటీ లే కారణం.. అసలు గుట్టు విప్పిన దర్శకుడు..

గత కొద్దికాలంగా స్టార్ హీరోల రెమ్యూనరేషన్ దగ్గర నుంచి సినిమా బడ్జెట్ వరకు విపరీతంగా పెరిగిపోతుంది. అయితే ఈ పుణ్యం మొత్తం ఓటీటీ కే దక్కుతుంది అంటున్నాడు ఓ డైరెక్టర్. అసలు సినిమా బడ్జెట్ పెరగడానికి.. హీరోల రేమ్యూనరేషన్ పెరగడానికి.. ఓటీటీ ప్లాట్ఫార్మ్స్ కి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా. అసలు సీక్రెట్ అక్కడే ఉంది. ఈ విషయాన్ని డైరెక్టర్ వెట్రిమారన్ వివరించి మరీ చెప్పారు. ఇంతకీ ఆయన ఈ విషయంలో ఏం చెప్పారో తెలుసుకుందాం పదండి..

జూనియర్ ఎన్టీఆర్( Jr NTR) దేవర ( Devara)చిత్రంతో ప్రేక్షకుల మందు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ తో బాగా బిజీగా ఉన్నారు. అందులో భాగంగా చెన్నైకి వెళ్ళిన జూనియర్ ఎన్టీఆర్ను మీరు ఎవరితో పని చేయాలి అని కోరుకుంటున్నారు అని అడిగినప్పుడు ఓ విలక్షణమైన డైరెక్టర్ పేరును ఆయన వెల్లడించారు. ఆయన మరెవరో కాదు నారప్ప లాంటి క్లాసిక్ చిత్రాలను అందించిన డైరెక్టర్ వెట్రిమారన్ ( Vetrimaaran). దీంతో ఆయనకు సంబంధించిన ఏ న్యూస్ వచ్చినా వైరల్ అవుతుంది. అలా డైరెక్టర్స్ తో ఓ రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఆన్లైన్ ప్లాట్ ఫామ్( online platforms)ల గురించి మాట్లాడుతూ వెట్రిమారన్ రజినీకాంత్ (Rajinikanth), విజయ్ (Vijay ) లాంటి స్టార్ హీరోల సినిమాలకు నిర్మాణం ప్రారంభం కాకముందే ఓటీటీ (OTT)సంస్థలు సుమారు 120 కోట్ల వరకు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయట. డిజిటల్ లో ఇంత డబ్బు వస్తోంది అంటే అది తమ క్రేజ్ వల్లే అని భావించిన నటులు పారితోషకంని విపరీతంగా పెంచేస్తున్నారు. డబ్బులు ఎలాగో వస్తాయి అన్న ధీమా నిర్మాతల్లో ఏర్పడుతుంది కాబట్టే ముందు వెనక చూడకుండా సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు చిక్కు ఉంది..

సినిమా హిట్ అయితే ముందుగా చెప్పినంత ఇస్తాము అనే ఓటీటీ సంస్థలు ఒకవేళ మూవీ రిజల్ట్ బాగా లేకపోతే అంత ఇవ్వలేము అంటూ బేరాలు పెడతాయట. అంతేకాదు కరోనా టైంలో భారీగా సినిమాల హక్కుల కోసం ఖర్చుపెట్టిన ఈ సదరు ఓటిటిలు ఇప్పుడు మిడ్ రేంజ్ సినిమాలకు చుక్కలు చూపిస్తున్నాయట. ఇదే కంటిన్యూ అయితే క్రమంగా ఇండస్ట్రీని ఓటిటిలు ప్రభావితం చేసే అవకాశం ఉంది అంటున్నారు ఈ డైరెక్టర్.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :