ASBL Koncept Ambience
facebook whatsapp X

నాన్న‌పై సూప‌ర్ కాన్ఫిడెంట్ గా ఉన్న టీమ్

నాన్న‌పై సూప‌ర్ కాన్ఫిడెంట్ గా ఉన్న టీమ్

చిన్న‌, మ‌ధ్య త‌ర‌హా సినిమాల‌కు ముందుగానే ప్రీమియ‌ర్లు వేయ‌డ‌మంటే మామూలు రిస్క్ కాదు. టాక్ ఏ మాత్రం అటూ ఇటూగా వ‌చ్చినా ఆ ఎఫెక్ట్ డైరెక్ట్ గా సోష‌ల్ మీడియా వ‌ల్ల ఓపెనింగ్స్ పై ప‌డుతుంది. అందుకే ఈ విష‌యంలో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఎంతో ఆలోచించి కానీ ఓ నిర్ణ‌యానికి రారు. అయితే సినిమా టాక్ బావుంటే మాత్రం రిలీజ్ రోజు నుంచే మంచి క‌లెక్ష‌న్స్ ఊపందుకుంటాయి.

మేజ‌ర్(Major), బ‌లగం(Balagam), బేబీ(Baby) లాంటి సినిమాలు ఇలా స్పెష‌ల్ పెయిడ్ షోలు వేసే మంచి ప్ర‌మోష‌న్స్ అందుకున్నాయి. ఇప్పుడు ఇదే దారిలో సుధీర్ బాబు(Sudheer Babu) మా నాన్న సూప‌ర్ హీరో(Maa Nanna Super Hero) వ‌స్తోంది. అభిలాష్(Abhilash) ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా అక్టోబ‌ర్ 11న రిలీజ్ కానుండ‌గా రేపు సాయంత్రం నుంచే ప్రీమియ‌ర్లు వేస్తున్నారు. సినిమాలోని కంటెంట్ పై ఎంతో నమ్మ‌కం ఉంటే త‌ప్ప ఇంత డేర్ చేయ‌రు.

అయితే మేక‌ర్స్ ఈ స్టెప్ వేయ‌డానికి రీజ‌న్ మెయిన్ గా పోటీ. ద‌స‌రా సీజ‌న్ కావ‌డంతో ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. గురువార‌మే ర‌జినీకాంత్(Rajinikantha) వేట్ట‌యాన్(Vettayan) వ‌స్తోంది. బ‌జ్ లేక‌పోయినా ర‌జినీ సినిమాను త‌క్కువ అంచ‌నా వేయ‌లేం. మా నాన్న సూప‌ర్ హీరోతో పాటూ గోపీచంద్(Gopichand) విశ్వం(Viswam) కూడా రిలీజ‌వుతుంది. ఈ సినిమా మాస్, ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను టార్గెట్ గా చేసుకుని వ‌స్తోంది. మార్టిన్(Martin) పై పెద్ద‌గా బ‌జ్ లేదు. దిల్ రాజు(Dil Raju) నుంచి జ‌న‌క అయితే గ‌న‌క(janaka ayithe ganaka) వ‌స్తోంది కాబ‌ట్టి పోటీ గ‌ట్టిగానే ఉంటుంది. వీటితో పాటూ ఆలియా భ‌ట్(Alia Bhatt) జిగ్రా(Zigra) కూడా ఉంది. ఎవరికి వారే త‌మ సినిమాల‌పై చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో కేవ‌లం ఫ్యామిలీ ఆడియ‌న్స్ ను మాత్ర‌మే టార్గెట్ చేసిన మా నాన్న సూప‌ర్ హీరో ఆడియ‌న్స్ ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించాలంటే ముందుగా ప్రీమియ‌ర్లు వేసి మంచి టాక్ తెచ్చుకోక త‌ప్ప‌ద‌ని భావించే మేక‌ర్స్ ఈ డెసిష‌న్ తీసుకున్నార‌ట‌. ఇప్ప‌టికైతే ఈ సినిమాకు హైద‌రాబాద్, విజ‌య‌వాడ‌, వైజాగ్ లాంటి ప్ర‌ధాన న‌గ‌రాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి.  

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :