ASBL Koncept Ambience
facebook whatsapp X

ఆర్టికల్ 370పై అగ్గిరాజేసిన పాక్ మంత్రి .. కాంగ్రెస్ దేశద్రోహులతో చేతులు కలిపిందని బీజేపీ ధ్వజం

ఆర్టికల్ 370పై అగ్గిరాజేసిన పాక్ మంత్రి .. కాంగ్రెస్ దేశద్రోహులతో చేతులు కలిపిందని బీజేపీ ధ్వజం

ఆర్టికల్ 370పై పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370కి సంబంధించిన విషయంలో కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) కూటమి వైఖరితో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఏకీభవిస్తుందని తెలిపారు. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీ కూటమి విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కశ్మీర్‌లో ఆర్టికల్ 370, 35A పునరుద్దరించే విషయంలో పాకిస్థాన్, కాంగ్రెస్-ఎన్సీ కూటమి ఓకే వైఖరితో ఉన్నాయని స్పష్టం చేశారు.

కశ్మీర్‌లో మొదటి దశ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలోనే ఖవాజా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఎన్సీ హామీ ఇవ్వగా, కాంగ్రెస్ ఈ అంశంపై మౌనంగా ఉంది. దానిని తన ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చలేదు. అయితే, కశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదాను పునరుద్ధరించడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పలుమార్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి. మరోవైపు.. పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలపై ఎన్సీనేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. భారత అంతర్గత విషయాల్లో జోక్యం చెసుకోవద్దని సూచించారు.

తమ దేశంలో ప్రజాస్వామ్యం సంగతి ముందు చూసుకోవాలని చురక వేశారు. ప్రస్తుతం కశ్మీర్ లో ఎన్నికలు జరుగుతున్నాయని.. ఇలాంటి తరుణంలో అనవసర వ్యాఖ్యలు చేయొద్దని గట్టిగా చెప్పారు. ఆసిఫ్ వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్.. దేశద్రోహులతో చేతులు కలిపిందని మండిపడ్డారు. అందుకే రాహుల్ గాంధీ.. తరచూ వారి మాటలే మాట్లాడుతారన్నారు. ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్ జరిగిందనడానికి ఆధారాలు చూపాలని డిమాండ్ చేసిన విషయాన్ని అమిత్ షా ప్రస్తావించారు. ఆర్టికల్ 370, 35 ఏ పునరుద్ధరణ విషయంలో పాకిస్తాన్, కాంగ్రెస్ కూటమి వ్యాఖ్యలు ఒకేలా ఉన్నాయన్నారు.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :