ASBL Koncept Ambience
facebook whatsapp X

కనిపిస్తే కాల్చివేత.. పాక్ సర్కార్ ఉత్తర్వులు..

కనిపిస్తే కాల్చివేత.. పాక్ సర్కార్ ఉత్తర్వులు..

మాజీ ప్రధాని, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ను విడుదల చేయాలంటూ నాలుగురోజులుగా ఆపార్టీనేతలు దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తున్నారు.రావల్పిండిలోని అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్‌‌ఖాన్‌‌ను కలుసుకునేందుకు దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు భారీ కాన్వాయ్‌‌తో ఇస్లామాబాద్‌‌కు ర్యాలీగా వస్తుండడంతో పాక్ పోలీసులు అప్రమత్తమయ్యారు. వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. ఇమ్రాన్‌‌ మద్దతుదారులను చెదరగొట్టడానికి టియర్‌‌‌‌ గ్యాస్‌‌ ప్రయోగించారు.ఈ ఘర్షణల్లో 11 మంది సిబ్బంది చనిపోగా.. పలువురు నిరసనకారులకు గాాయాలయ్యాయి. దీంతో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసింది పాక్ సర్కార్.

మరోవైపు..పీటీఐ చైర్మన్‌‌ గోహర్‌‌‌‌ అలీ ఖాన్‌‌తో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు జైలులో ఇమ్రాన్ ను కలుసుకున్నారు అయితే, ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్న వందలాది మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీలైనంత ఎక్కువ మందిని చంపాలనే ఉద్దేశ్యంతోనే పాక్ భద్రతా దళాలు నిరసనకారులపై కాల్పులు జరుపుతున్నాయని పిటిఐ నేతలు ఆరోపించారు. ఇక, పీటీఐ మద్దతుదారులు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలో 11మంది భద్రతా సిబ్బంది చనిపోగా.. పదుల సంఖ్యలో ఆస్పత్రి పాలయ్యారు. భద్రతా సిబ్బంది చేపట్టిన చర్యలను ఫాసిస్ట్ మిలిటరీ పాలనగా పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ అభివర్ణించింది. ఆందోళనకారులు ఇస్లామాబాద్‌‌కు రాకుండా పోలీసులు అన్ని రోడ్లను మూసివేశారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

నిరసనల నేపథ్యంలో పంజాబ్‌‌ ప్రావిన్స్ కు దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. నిత్యవసరాల రవాణా నిలిచిపోవడంతో కూరగాయలు, పండ్లకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిరసనలు ఇలాగే కొనసాగితే పరిస్థితి మరింత దిగజారుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు... పాకిస్తాన్ సమాచార మంత్రి అతా తరార్..ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీని విమర్శించారు. ఆమె హింసను ప్రేరేపించారని ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగించాలని తన మద్దతుదారులకు నిరంతరం పిలుపునిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

డి-చౌక్ వద్ద భద్రతా బలగాలను మోహరింపు

ఇస్లామాబాద్‌లోని డి-చౌక్ నుంచి జిన్నా అవెన్యూలోని చైనా చౌక్ వరకు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు (LEAs) పరిస్థితిని నియంత్రించాయి. బుష్రా బీబీ కాన్వాయ్ 7వ అవెన్యూకి తరలించారు. నగరంలోని ప్రధాన మార్కెట్‌లు, ప్రదేశాలలో హింసాత్మక వాతారణం నెలకొనడంతో LEAలు F-6 సూపర్ మార్కెట్, F-7 జిన్నా సూపర్ మార్కెట్, F-10, F-11, G-6, G-7, G-8ని మూసివేశారు. మరోవైపు..షాబాజ్-జర్దారీ-అసిమ్ కూటమి నేతృత్వంలో పాక్ భద్రతా దళాలు మారణహోం కోసం ట్రై చేస్తున్నాయని పీటీఐ ట్విట్టర్‌ వేదికగా ఒక పోస్ట్‌ చేసింది. గత ఏడాది ఆగస్టు నుంచి జైలులో ఉన్న మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కు మద్దతుగా నవంబర్ 24వ తేదీన దేశవ్యాప్త నిరసనలకు పీటీఐ పార్టీ చివరి పిలుపునిచ్చింది.

 

 

praneet praneet praneet Koncept Ambience Radhey Skye APR Group
Tags :