ASBL Koncept Ambience
facebook whatsapp X

పాన్ ఇండియా మూవీ 'మట్కా' పవర్ ప్యాక్డ్ న్యూ పోస్టర్ రిలీజ్

పాన్ ఇండియా మూవీ 'మట్కా' పవర్ ప్యాక్డ్ న్యూ పోస్టర్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)మోస్ట్ ఎవైటెడ్  మూవీ 'మట్కా'(Matka) రిలీజ్ కు రెడీగా వుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్,  SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. ఫస్ట్ సింగిల్ లే లే రాజా చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

నవంబర్ 14న సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది. తాజాగా మేకర్స్ 'మట్కా' 30 డేస్ కౌంట్ డౌన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. వరుణ్ తేజ్ సోఫాలో కూర్చుని ఒక చేతిలో గన్, మరో చేతిలో సిగరెట్ తో కనిపించిన పోస్టర్ అదిరిపోయింది. 'వైలెన్స్ విత్ విజన్' అనే క్యాప్షన్ తో ప్రజెంట్ చేసిన ఈ పోస్టర్ లో వరుణ్ తేజ్ వింటేజ్ అవతార్ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.    

మట్కా వరుణ్ తేజ్ మోస్ట్ ఎక్స్ పెన్సీవ్ మూవీ. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం జివి ప్రకాష్ కుమార్ అందించగా, ఎ కిషోర్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఆర్ ఎడిటర్.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :