ASBL NSL Infratech
facebook whatsapp X

పిఠాపురం నుంచే ఎస్‌ఎల్‌ఆర్‌ఎం ప్రారంభిస్తాం

పిఠాపురం నుంచే ఎస్‌ఎల్‌ఆర్‌ఎం ప్రారంభిస్తాం

గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, రాష్ట్రంలోని పంచాయతీల్లో ఎక్కడా డబ్బులు లేవని ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కార్యాలయానికి వచ్చిన డిప్యూటీ సీఎంకు అధికారులు ఘన స్వాగతం పలికారు. సాలిడ్‌ అండ్‌ లిక్విడ్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ (ఎస్‌ఎల్‌ఆర్‌ఎం) పై కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పవన్‌ తిలకించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ సాలిడ్‌ అంటే లిక్విడ్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ను ముందుకు తీసుకెళ్లాలి. జలం మనకు పూజ్యనీయం. అది కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ప్రస్తుతం ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇబ్బందులు వస్తున్నాయి. ప్లాస్టిక్‌ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం బాధగా ఉంది. చెత్తను రీసైక్లింగ్‌ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలి. ఎస్‌ఎల్‌ఆర్‌ఎంను తొలుత పిఠాపురం నుంచే ప్రారంభిస్తాం. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ , పరిశుభ్రతను ప్రజలు బాధ్యతగా తీసుకోవాలి. ఒక్కో పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తాం. చెత్తతో ఏటా రూ.2,643 కోట్ల ఆదాయం తీసుకు రావచ్చు. రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వీలవుతుంది. ఒక్కో రోజులో పంచాయతీల దుస్థితిని మార్చలేం. మార్పు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందన్నారు. 

 


 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye
Tags :