వారి తప్పులు మాకు శాపాలుగా మారాయి.. జగన్ సర్కార్ పై పవన్ ఘాటు విమర్శలు..
ఆంధ్రాలో ప్రస్తుతం సోషల్ మీడియా విషయంలో జరుగుతున్న రచ్చ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో గత కొద్దికాలంగా చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పరిస్థితి ఇరకాటంలో పడింది. గతంలో ఆయన చేసిన పనికి ఇప్పుడు వర్మ పరిపాల చోట్ల కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఆయన బెయిల్ పిటీషన్ పై కోర్టు విచారణ వాయిదా వేసిన నేపథ్యంలో పోలీసులు అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారు అని వర్మ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్న ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ వర్మ వ్యవహారంపై స్పందించారు. మీడియా సమావేశంలో వర్మ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయితే ఆర్జీవితో పాటు విచారణకు మరికొందరు కూడా హాజరుకోకపోవడంపై తాను ఇప్పుడే స్పందించను అని చెప్పిన పవన్ . తన పని తాను చేస్తానని, పోలీసుల సామర్థ్యంపై తనకు నమ్మకం ఉందని ఈ విషయంపై స్పందించబోనని పేర్కొన్నారు. అంతేకాదు తన పరిధిలో హోమ్ శాఖ కాని.. లా అండ్ ఆర్డర్ కానీ లేవని పవన్ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై చంద్రబాబును అడిగితే బాగుంటుంది అని సూచించిన పవన్.. విలేకరులు అడిగిన అంశాలను చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని కూడా చెప్పారు.
చంద్రబాబు అరెస్టు విషయంలో ఎంతో దూకుడుగా వ్యవహరించిన పోలీసులు వర్మ వంటి వారి అరెస్టుల వ్యవహారంలో ఎందుకు స్లోగా ఉన్నారో అన్న ప్రశ్నకు పవన్ ఇచ్చిన జవాబు ఇది. మరోపక్క అదానీ-జగన్ ముడుపుల వ్యవహారంపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని పవన్ పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వానికి అస్సలు బాధ్యత లేదని.. కేవలం సమోసాల కోసం 9 కోట్లు ఖర్చుపెట్టిన జగన్ ప్రభుత్వాన్ని ఏమని అనాలో కూడా అర్థం కావడంలేదని పవన్ విమర్శించారు. ఒకరకంగా ఆ ప్రభుత్వం చేసిన తప్పులు ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి శాపాలుగా మారాయని ఆయన పేర్కొన్నారు.