సరస్వతీ పవర్ సంస్థ భూముల విషయంలో వైసిపి నేతలకు దొరికిపోయిన పవన్..
ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, ఆయన చెల్లెలు షర్మిల మధ్య జరుగుతున్న ఆస్తుల వివాదం వైరల్ అవుతుంది. తీవ్ర చర్చనీయాంసంగా మారిన ఈ ఇష్యులు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇరుక్కున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో జరుగుతున్న ఆస్తుల తగాదాలు నాలుగు ప్రెస్ మీట్ లు.. మూడు ఉత్తరాలు.. రెండు తగాదాలు అన్నట్టు సాగుతోంది.
తాజాగా ఈ విషయంలో రాజశేఖర్ రెడ్డి భార్య విజయమ్మ రాసిన లేక మరొక సంచలనంగా మారింది. వీటన్నిటి మధ్యలో సరస్వతీ పవర్ సంస్థ భూములకు సంబంధించిన ఓ ఆసక్తికర సంఘటన తెరపైకి వచ్చింది. అయితే వీటితో వేటితో సంబంధం లేకపోయినప్పటికీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో తెగ హైలైట్ అవుతున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం పదండి.. నిజానికి సరస్వతీ పవర్ సంస్థకు చెందిన భూముల విషయంలో ఎటువంటి వివాదము లేదు. కేవలం జగన్ మీద కేసులు పెండింగ్ ఉన్న కారణంతో ఈ భూములు ఈడి అటాచ్మెంట్ లో భాగమయ్యాయి. అంటే వీటిని అనుభవించే వసతి ఉంది కానీ ఇతర లావాదేవీలకు ఈ భూములను వాడలేరు. ఇక ఆ విషయం పక్కన పెడితే తాజాగా ఈ భూములపై ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ నేపథ్యంలో సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూములలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు, అటమీ భూములు ఏమైనా ఉన్నాయేమో చూడాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన రెవెన్యూ శాఖ అధికారులు హుటాహుటిన సరస్వతీ పవర సంస్థకు సంబంధించిన భూముల వివరాలను పరిశీలించారు. అయితే పవన్ కళ్యాణ్ ఆశించినట్టుగా ఈ భూములలో ఎటువంటి అవకతవకలు జరగలేదు. ప్రస్తుతం జగన్ ఫ్యామిలీలో జరుగుతున్న ఆస్తుల వివాదాల నేపథ్యంలో సరస్వతీ పవర్ సంస్థ ల్యాండ్స్ సర్వే చేయడానికి పవన్ ఆదేశించడం.. అయితే ఉన్నవన్నీ పక్కాగా పట్టా భూములు అని రెవెన్యూ అధికారులు స్పష్టంగా తేల్చి చెప్పడం.. ఓ రకంగా పవన్ ను కార్నర్ చేసింది. ఇక అవకాశం దొరికింది కదా అని రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. ఈ భూములపై సర్వే చేసిన అధికారులు ఇచ్చిన వివరణకు సంబంధించిన వీడియోలు ఫోటోలు వైరల్ చేస్తూ పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేస్తున్నారు. నెట్టింట తాజాగా షురూ అయిన ఈ రచ్చ ఏ రేంజ్ కి పోతుందో చూడాలి.