ASBL Koncept Ambience
facebook whatsapp X

పరిణితి లేని నేతగా పవన్ మిగిలిపోతాడా..?

పరిణితి లేని నేతగా పవన్ మిగిలిపోతాడా..?

ఆంధ్రాలో శ్రీవారి లడ్డు (Srivari Laddu) ప్రసాదం ఏ రేంజ్ లో వివాదాస్పదంగా  మారిందో అందరికీ తెలుసు. ఒక్కసారి నేతిలో కల్తీ ( Adulterated Ghee) జరిగింది అన్న అనుమానం ఉంది అని చంద్రబాబు (Chandra babu) చెప్పడంతో నేతలు అందరూ తమకు తోచిన విధంగా ఈ ఇష్యూ  పై రెస్పాండ్ అయ్యారు. అందరిలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అసలు విషయం ఏమిటో తెలుసుకోకుండానే ప్రాయశ్చిత్త దీక్ష అంటూ కాషాయ వస్త్రాలు కట్టేశారు. గుడిమెట్లు కడగడం, సనాతన ధర్మం గురించి స్పీచ్ లు మాట్లాడడం కలిసి వస్తుంది అనుకున్న పవన్ ఎప్పుడు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మిగిలిపోయారు. 

సుప్రీం కోర్టు (Supreme court) ధర్మాసనం తిరుమల లడ్డు కల్తీ ( Tirumala Laddu ) విషయంలో అడిగిన ప్రశ్నలకు టీటీడీ( TTD ) తరఫునుంచి సంతృప్తికరమైన సమాధానం రాలేదు. మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావద్దని.. కనీసం దేవుడినైనా రాజకీయాలకు దూరంగా ఉంచండి అంటూ సుప్రీంకోర్టు మెత్తగా మొటికాయలు వేసి పంపించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ ఇష్యూని రైస్ చేసిన చంద్రబాబు కంటే కూడా ప్రాయశ్చిత్త  దీక్ష అంటూ హడావిడి చేసిన పవన్ పై సోషల్ మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంది.

తిరుమల శ్రీవారి లడ్డు (Tirumala Laddu) వ్యవహారం కేవలం రాజకీయ విమర్శగా ఉంది అని కొందరు గట్టిగా నమ్ముతున్నారు. నిజంగా కల్తీ జరిగిందో లేదో కూడా తెలుసుకోకుండా భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు అని కొందరు నిందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందు సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలు ఎవరికోసం అన్న వాదన కూడా వినిపిస్తోంది. సినీ యాక్టర్ ప్రకాష్ రాజ్ (Prakash Raj) ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రైస్ చిత్త దీక్షను తప్పు పట్టిన విషయం.. అనంతరం ఇద్దరి మధ్య మాటల యుద్ధం అందరికీ తెలిసిందే. 

30 న విదేశాలలో జరుగుతున్న షూటింగ్ నుంచి తిరిగి వచ్చాక సమాధానం ఇస్తానని ప్రకాష్ రాజ్ అనడం.. ఈలోగా ధర్మాసనం మెత్తగా మొటిక్కాయలు వేయడం తో నెక్స్ట్ ప్రకాష్ రాజ్ ఏ రకంగా కౌంటర్ ఇస్తారు అన్న విషయం కూడా హాట్ టాపిక్ గా మారి. ఇక సుప్రీం కోర్టులో జరిగిన విచారణ సందర్భంగా ఈ విషయంలో ఆధారాల కంటే కూడా అనుమానాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించాము అని టీటీడీ చెప్పిన రెండు నెలల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు ముందు వెనక ఆలోచించకుండా ఈ విషయం గురించి మీడియా ముందు ప్రస్తావించారు. ల్యాబ్ రిపోర్ట్ ప్రకారం లడ్డుకు ఉపయోగించిన నేతిలో జంతువుల కొవ్వు కలిసి ఉంది అని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనో భావాలను దెబ్బతీశాయి. ఆయన కంటే రెండు ఆకులు ఎక్కువ చదివిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మమంటూ.. అవసరమైతే ప్రాణత్యాగానికి కూడా సిద్ధమంటూ రెచ్చగొట్టడానికి ప్రయత్నించారు. 

చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను సుప్రీంకోర్టు కూడా తప్పు పట్టడం గమనార్హం. కోట్లాదిమంది మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఉన్నత పదవిలో ఉన్నవారు ఇలా ప్రవర్తించకూడదు అని సుప్రీంకోర్టు ఏపీ సీఎంకు హితవు చెప్పింది. అయితే చంద్రబాబు కంటే కూడా ఎక్కువగా ఈ విషయంలో ఫోకస్ అయిన పవన్ కళ్యాణ్ రాజకీయంగా తనకు ఎటువంటి పరిణితి లేదు అన్న విషయాన్ని స్వతహాగా ప్రూవ్ చేసుకున్నారు. తాజాగా 100 రోజుల పాలన గురించి గొప్పగా చెప్పుకున్న కూటమికి తిరుపతి లడ్డు పెద్ద ఎదురుదెబ్బలా తయారయ్యింది.

 

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :