Pawan’s style of revenge on Dwarampudi: పవన్ దెబ్బకు అబ్బా అంటున్న ద్వారంపూడి..
పార్టీ పెట్టి పది సంవత్సరాలు గడుస్తున్న ఏమి చేయటం లేదు అని విమర్శలు ఎదుర్కొన్న జనసేన (Jansena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన స్టైల్ రాజకీయం ఎలా ఉంటుందో అందరికీ పరిచయం చేస్తున్నాడు. మరి ముఖ్యంగా ద్వారంపూడి పరిస్థితి గమనించిన ఎవరికైనా సరే పవన్ కళ్యాణ్ ఏ రేంజ్ లో విరుచుకుపడతాడు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది కేవలం రాజకీయ వర్గాల్లోనే కాదు.. ఇటు వ్యాపార వర్గాల్లో కూడా గట్టిగా వినిపిస్తున్న మాట.
ఒకప్పుడు ద్వారంపూడి (Dwarampudi) ,పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా, రాజకీయంగా తీవ్రస్థాయిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పట్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడి.. జనసేన అధినేతను ఓ రేంజ్ లో విమర్శించారు. దీనికి స్పందించిన పవన్ కాకినాడలో నిర్వహించిన వారాహి యాత్రలో ద్వారంపూడి అక్రమాలను వెలికి తీసి సామ్రాజ్యాన్ని నేలమట్టం చేస్తానని చెప్పారు. ఇప్పుడు చెప్పినట్టుగానే ద్వారంపూడికి అన్ని దారులు మూసేస్తున్నారు.
ముందు నువ్వు గెలిచి ఆ తర్వాత నా గురించి మాట్లాడు అని అప్పట్లో ద్వారంపూడి పవన్ మాటలను చాలా లైట్ తీసుకున్నాడు. అయితే ఘన విజయాన్ని పొందిన పవన్ ఆ తరువాత వారంపూడి వ్యాపారాలను ఒక్కొక్కటిగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. పౌరసరఫరాల శాఖను ఏరి కోరి తీసుకున్న పవన్.. మంత్రిగా విధేయుడైన నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) ను నియమించేలా నాదెండ్ల కూడా వచ్చిన రోజు నుంచి వరుసగా కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలలో రైసుమిళ్లను టార్గెట్ చేసి ఓ రేంజ్ లో తనిఖీలు నిర్వహించారు.
ఇక నాదెండ్ల లెక్క ప్రకారం వీటిపై ఇప్పటికే సుమారు 1000 కి పైగా కేసులు నమోదయ్యా. ఇక తాజాగా కాకినాడ పోర్టులో(Kakinada Port) అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని పవన్ ఏ రేంజ్ లో ఆపారో అందరికీ తెలుసు.”సీజ్ ది షిప్..”అనే పవన్ డైలాగ్ సినిమా డైలాగ్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకినాడలోని కరప ప్రాంతంలో ఉన్న వీరభద్ర ఎక్స్పోట్స్ కు చెందిన రొయ్యల ఫ్యాక్టరీ ఆగస్టున పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మూసివేసింది. ఇక అలాగే లంపకలోవలో ద్వారంపూడికి చెందిన మరొక ఫ్యాక్టరీని కూడా మూసివేశారు. పవన్ ఫాలో అవుతున్న స్ట్రాటజీ చూస్తుంటే ద్వారంపూడి కి సంబంధించిన అక్రమాలపై పూర్తిగా అధ్యయనం చేశాకే బరిలోకి దిగినట్టు కనిపిస్తోంది. మొత్తానికి పవన్ పగ పడితే ఎలా ఉంటుంది అనే విషయానికి ద్వారంపూడి సాక్ష్యం అంటున్నారు పరిశీలకులు.