వారికి రాజకీయాల్లో స్థానం ఉండకూడదు : డిప్యూటీ సీఎం పవన్
నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో మిమ్మల్ని అడుగు పెట్టనివ్వమని ఛాలెంజ్ చేసిన వాళ్లే ఈ రోజు మీ ముందు సభలో అడుగు పెట్టలేకపోయారు. కర్మ అంత బలంగా ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన రఘురామకృష్ణరాజుకు పవన్ అభినందనలు తెలిపారు. ఆయన పోరాట పటిమని కొనియాడారు. ఉండి నియోజకవర్గం నుంచి 56 వేల పైచిలుకు ఓట్లతో గెలిచి మీరు అసెంబ్లీకి వచ్చారు. గత ప్రభుత్వం రాజకీయాలను నేరమయం చేసింది. నేరస్థులు అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో మొన్నటి వరకూ చూశాం. గత ప్రభుత్వంలో అందరూ ఏదో రకంగా ఇబ్బందులు పడ్డారు. రాజకీయాల్లో నేరస్థులకు స్థానం ఉండకూడదు. దురదృష్టవశాత్తూ 2019లో నేరస్థులు అధికారంలోకి వచ్చారు అని పవన్ అన్నారు.
Tags :