ASBL NSL Infratech

సూర్యారాధన చేసిన పవన్‌ కల్యాణ్‌

సూర్యారాధన చేసిన పవన్‌ కల్యాణ్‌

 

వారాహి ఏకాదశ దీక్షలో ఉన్న జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సూర్యారాధన క్రతువులో పాల్గొన్నారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ ఆరాధనను నిర్వహించారు. నిత్యం సూర్య నమస్కారాలు ఆచరించే పవన్‌ కల్యాణ్‌కు ఇటీవల వెన్ను సంబంధిత సమస్య తలెత్తడంతో వాటిని చేయలేదు. అందుకు ప్రతిగా ఈసారి మంత్రసహిత సూర్య ఆరాధనను నిర్వర్తించారు. సమాజ క్షేమాన్ని, దేశ సౌభాగ్యాన్ని కాంక్షిస్తూ ఆయన ఈ క్రతువును ఆచరించారని జనసేన పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. సూర్యారాదన విశిష్టతను వేదపండితులు కోసిగంటి సుధీర్‌ శర్మ, హరనాథ శర్మ, వేణుగోపాలశర్మ పవన్‌ కల్యాణ్‌కు వివవరించారు. 
 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :