ASBL Koncept Ambience
facebook whatsapp X

పవన్ మ్యాజిక్ vs ప్రకాష్ రాజ్ లాజిక్.. తేలేది రేపే..

పవన్ మ్యాజిక్ vs ప్రకాష్ రాజ్ లాజిక్.. తేలేది రేపే..

ఎన్నికలకు ముందు తెగ ఆవేశపడిన పవన్ (Pawan Kalyan) ఎన్నికల అనంతరం ఉపముఖ్యమంత్రిగా (Deputy CM) బాధ్యతలు చేపట్టాక చాలా సైలెంట్ గా ఉన్నారు. పవన్ లో వచ్చిన ఈ మార్పు.. ఆయన చూపిస్తున్న సహనంపై ప్రశంసలు కూడా వచ్చాయి. అయితే సడన్గా తిరుమలలో లడ్డు (Tirumala Laddu) విషయంలో అనవసరమైన ఆవేశాన్ని కనబరుస్తూ పవన్ చాలా హైలైట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో కొందరు సెలబ్రిటీలతో కూడా పవన్ కి వాదోపవాదాలు జరిగాయి.

విపక్షంలో ఉన్నప్పుడు ఆవేశం బాగుంటుంది కానీ అధికారంలో ఉన్నప్పుడు అదే ఆవేశం మనకు మైనస్ పాయింట్ అవుతుంది. ఈ చిన్న లాజిక్ ని పవన్ ఎందుకో మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది. అందుకే అనవసరమైన ఇరకాటంలో పడిపోయాడు. తిరుమల లడ్డు (Tirumala Laddu) నేపథ్యంలో ప్రకాష్ రాజ్ కు (Prakash Raj ) పవన్ కళ్యాణ్ కు మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికీ తెలిసిందే. అసలు ఈ విషయంలో విమర్శించాల్సిన అవసరం ప్రకాష్ రాజ్ కు(Prakash Raj ) ఏముంది అని పవన్ అడిగినప్పుడు.. విదేశాల్లో షూటింగ్లో ఉన్న ప్రకాష్ రాజ్.. ఇప్పుడు తాను ఏమీ మాట్లాడను అని చెబుతూ ఈనెల 30న మాత్రం పవన్ ప్రశ్నలకు కచ్చితంగా జవాబు ఇస్తాను అని పేర్కొన్నారు. 

ప్రకాష్ రాజ్ ఎంత ముక్కుసూటిగా మాట్లాడుతారు అంత లాజిక్ గా అవతల మనిషిని మాట్లాడనివ్వకుండా చేస్తారు. పైగా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి కాబట్టి పవన్ కి సంబంధించి ఎన్నో విషయాలు ఆయన చేతిలో ఉండే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కాస్త ప్రకాశాలు మాటలకు జంకినట్లు టాక్. అందుకే అతను గతంలో మాట్లాడిన తీరుకి ఇప్పుడు ప్రకాష్ రాజ్ గురించి మాట్లాడుతున్న తీరికి చాలా తేడా కనిపిస్తోంది. మరోపక్క ప్రకాష్ రాజు ఎక్స్ వేదికగా రోజుకొక ట్వీట్ తో పవన్ను కామెంట్ చేస్తూనే ఉన్నారు. జస్ట్ ఆస్కింగ్ అంటూ ని అడగాల్సినవన్నీ పద్ధతిగా అడుగుతున్నారు. ఎన్నికల ముందు ఒక అవతారం అధికారం వచ్చాక మరొక అవతారం అంటూ ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అలాగే మీకు ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడం కావాలా? అంటూ ప్రకాష్ రాజ్ పెట్టిన మరో ట్వీట్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. వీటన్నిటిని బట్టి చూస్తే పవన్ ను ప్రకాష్ రాజ్ బాగా టార్గెట్ చేశాడు అని అర్థమవుతుంది.

మరోపక్క పవన్ తనకు మిత్రుడు అయిన ప్రకాష్ రాజ్ కు తనకు కాస్త అభిప్రాయ విభేదాలు ఉండొచ్చు కానీ మా ఆయనను గౌరవిస్తాను అని పేర్కొన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో దోషులకు శిక్ష పడాలి అనే ఉద్దేశంతో తాను ట్వీట్ పెట్టానని.. అయితే ప్రకాష్ రాజ్ దానిపై కామెంట్ చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మరి ఇప్పుడు ప్రకాష్ రాజు వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ యుద్ధం మరిన్ని సరికొత్త ట్విస్టులు తిరుగుతుందో చూడాలి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :