ASBL Koncept Ambience
facebook whatsapp X

కోనేటి ఆదిమూలం కేసులో సంచలన పరిణామం..!!

కోనేటి ఆదిమూలం కేసులో సంచలన పరిణామం..!!

కొన్ని సంఘటనలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. తీవ్ర సంచలనం కలిగించిన తర్వాత అంతే ఫాస్ట్ గా చల్లబడిపోతుంటాయి. ఇప్పుడు అంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. కొంతకాలం కిందట టీడీపీకి (TDP) చెందిన సత్యవేడు (Satyavedu) ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై (Koneti Adimulam) లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఇది పెద్ద సంచలనానికి దారితీసింది. ఈ వ్యవహారంపై వైసీపీ (YSRCP) పెద్ద రచ్చ రాజేసింది. బాధితురాలు ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి వీధికీడ్చడంతో ఇష్యూ పెద్ద దుమారానికి కారణమైంది. అయితే ఇప్పుడిది చల్లబడిపోయింది.

సత్యవేడు నుంచి టీడీపీ తరపున గెలిచిన కోనేటి ఆదిమూలంపై లైంగిక వేధింపుల (Sexual harassment) ఆరోపణలు సంచలనం కలిగించాయి. టీడీపీకే చెందిన ఓ మహిళా నాయకురాలు ఆయనపై ఈ ఆరోపణలు చేశారు. తనను బెదిరించి లొంగదీసుకున్నారని.. వ్యతిరేకిస్తే చంపేస్తానని హెచ్చరించాడని.. అందుకే లొంగిపోక తప్పలేదని ఆమె వెల్లడించారు. హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆమె ఈ విషయాలు తెలిపారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లానని.. అయినా చర్యలు లేకపోవడంతో ఇలా బహిరంగంగా చెప్పాల్సి వస్తోందని ఆమె వివరించారు.

టీడీపీ మహిళా నాయకురాలి ఆరోపణలపై అధిష్టానం సీరియస్ గా స్పందించింది. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ (Suspension) చేసింది. మరోవైపు బాధితురాలు తిరుపతిలో (Tirupati) కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పిలిస్తే ఆమె పలుమార్లు నిరాకరించారు. అదే సమయంలో తనపై కొందరు కక్షగట్టి ఇలా చేశారని.. తనకు సంబంధం లేకపోయినా తనను ఇరికించారని కోనేటి ఆదిమూలం వివరించారు. ఈ వ్యవహారం ఇలా కొనసాగుతుండగానే కోనేటి ఆదిమూలం హైకోర్టును (High court) ఆశ్రయించారు. తనపై పోలీసులు నమోదు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరారు.

అయితే ఈ వ్యవహారంలో ఇప్పుడు ఇద్దరూ రాజీకి (Compromise) వచ్చినట్లు తెలుస్తోంది. కోనేటి ఆదిమూలం, బాధిత మహిళ ఇద్దరూ ఒక్కతాటిపైకి వచ్చి రాజీ కుదుర్చుకున్నట్టు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఇద్దరూ హైకోర్టులో పిటిషన్ వేయడంతో దాన్ని ధర్మాసనం క్వాష్ (quash) చేసింది. దీంతో ఈ వ్యవహారం సద్దుమణిగినట్లే. తప్పు జరిగిందని ముందు ఆరోపించి.. తర్వాత రాజీ కుదుర్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. కోనేటి ఆదిమూలంతో ఆ మహిళకు మంచి సంబంధాలున్నాయని.. అనవసరంగా ఆయన్ను బద్నాం చేసిందని అప్పట్లోనే ఆమె సన్నిహితులు విమర్శించారు. ఇప్పుడు అది నిజమేనని అర్థమవుతోంది. ఈ ఇష్యూ సెటిల్ (settle) కావడంతో ఆయనపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ ఎత్తివేస్తుందా లేదా అనేది చూడాలి.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :