ట్రంప్ ప్రభుత్వంతో ఈ బంధం మరింత బలోపేతం : పీయూష్ గోయల్
డొనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికాతో భారత్ సంబంధాలు మరింత మెరుగుపడనున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధాని మోదీకి, ట్రంప్ మధ్య ఉన్న సాన్నిహిత్యమే అందుకు కారణమన్నారు. గ్లోబల్ టీడర్షిప్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. గతంలో ఒబామా, తర్వాత బైడెన్ ప్రభుత్వంతోనూ కలిసి పనిచేశామని, ఇరు దేశాల మధ్య బంధం ఎప్పటికప్పుడు బలోపేతం అవుతూ వస్తోందన్నారు. ట్రంప్ ప్రభుత్వంతో ఈ ఒంధం మరింత బలోపేతం కానుందని అన్నారు. ప్రధాని మోదీని అద్భుతమైన వ్యక్తి, డియర్ ఫ్రెండ్ అని ట్రంప్ సంబోంధించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు.
Tags :