ASBL Koncept Ambience
facebook whatsapp X

వక్రించిన పవన్ సనాతన ధర్మం.. కేసు నమోదు..

వక్రించిన పవన్ సనాతన ధర్మం.. కేసు నమోదు..

ప్రస్తుతం దేశంలో రాజకీయాల ట్రెండ్ చాలా డిఫరెంట్ గా నడుస్తోంది. ఒకప్పుడు తమ గురించి ఎవరైనా మాట్లాడితే నేతలు చూసి చూడనట్లు ఉండేవారేమో.. కానీ ఇప్పుడు ప్రత్యర్థులపై ఎంత స్ట్రాంగా రియాక్ట్ అయితే అంత పాపులర్ అవుతున్నారు. మరికొంతమంది పాపులారిటీ మోజులో పడి నోటికి వచ్చినట్టు మాట్లాడి కేసులలో చిక్కుకుంటున్నారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం (Deputy CM) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పరిస్థితి కూడా అలాగే తయారయ్యేలా కనిపిస్తోంది. ఎన్నికలకు ముందు స్ట్రాంగ్ గా కౌంటర్ లిస్టు ముందుకుపోయిన పవన్ ఎన్నికల తరువాత కాస్త సైలెంట్ అయినట్లుగా కనిపించారు. కానీ తిరుమల శ్రీవారి లడ్డు (Tirumala Laddu) వివాదం తెరపైకి రావడంతో పవన్లోని సనాతన ధార్మికుడు బయటికి వచ్చాడు. ఆవేశంగా మాట్లాడుతూ ప్రత్యర్థులపై చురకలు వేశాడు. ఈ క్రమంలో కొందరిని ప్రత్యేకంగా టార్గెట్ చేసి తన మాటల్లో విమర్శలను వాడిగా ఉపయోగించారు. 

ఈ నేపథ్యంలో తమిళనాడు డిప్యూటీ సీఎం.. ( Tamil Nadu Deputy CM) స్టాలిన్ కుమారుడు..ఉదయనిధి స్టాలిన్‌ (Udhayanidhi Stalin) పై కూడా పవన్ విమర్శించారు. గతంలో సనాతన ధర్మం గురించి ఉదయనిధి చేసిన కామెంట్స్ ని ప్రస్తావిస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా పవన్ ఇవ్వడం జరిగింది. మన రాష్ట్రంలో వారే మనల్ని విమర్శిస్తే ఊరుకోము అలాంటిది పక్క రాష్ట్రం వారు విమర్శిస్తే తమిళనాడు వారు ఊరుకుంటారా.. అందుకే ఈ వ్యవహారంపై తమిళ్ మీడియాలో (Tamil Media) ఓ రేంజ్ లో రచ్చ మొదలైంది. ఆంధ్ర డిప్యూటీ సీఎం వైఖరిపై చాలామంది మండిపడ్డారు. మతాలను రెచ్చగొట్టే విధంగా పవన్ మాట్లాడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. మధురైలో జరిగిన ఈ ఘటనతో ఏపీ డిప్యూటీ సీఎంపై కేసు నమోదు చేయడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ కు, కూటమికి ఊహించని షాక్ అనే చెప్పవచ్చు. 

పార్టీ పెట్టిన పది సంవత్సరాల తర్వాత రాజకీయంలో మెల్లగా ఎదగడం మొదలుపెట్టిన పవన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. తిరుపతిలో వారాహి సభ పెట్టిన పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అనేది ఒక వైరస్ లాంటిదని.. దాన్ని నాశనం చేస్తాను అంటూ గతంలో ఉదయనిధి ఇచ్చిన మాటలకు కౌంటర్ ఇచ్చారు. మరోపక్క ఉదయనిధి మాత్రం ఏ మాత్రం బ్యాలెన్స్ కోల్పోకుండా చాలా లైట్ గా చూద్దాం.. వెయిట్ చేద్దాం.. అన్నట్లు ఉన్నారు.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :