ASBL Koncept Ambience
facebook whatsapp X

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు.. బీఆర్‌ఎస్‌ మంత్రి పదవులు ఇవ్వలేదా?

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు.. బీఆర్‌ఎస్‌ మంత్రి పదవులు ఇవ్వలేదా?

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్‌ఎస్‌ కాదా అని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. హైదరాబాద్‌ వాసులను కాంగ్రెస్‌ ఏనాడూ విమర్శించలేదన్నారు. ఆంధ్రా ప్రజలను గతంలో కేసీఆర్‌ దారుణంగా విమర్శించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పని అయిపోందని సొంత పార్టీ నేత అరెకపూడి గాంధీ అంటున్నారని చెప్పారు. ప్రాంతీయతను రాజకీయంగా వాడుకునేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అరెకపూడి గాంధీ, కౌశిక్‌ రెడ్డి ఇద్దరూ చేసింది తప్పే. భౌతిక దాడులు మంచివి కాదు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. శాంతి భద్రతల అంశంలో కఠినంగా వ్యవహరిస్తాం. పార్టీ ఫిరాయింపులను మేం ఎక్కడ ప్రోత్సహించలేదు. బీఆర్‌ఎస్‌ గతంలో టీడీపీ, కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను చేర్చుకుంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌  మంత్రి పదవులు ఇవ్వలేదా అని పొన్నం ప్రవ్నించారు.
 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :