సోనియా ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా ? : మంత్రి పొన్నం
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పట్ల కృతజ్ఞతతో ఉండాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ ఏర్పడేదా అని బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. తెలంగాణ సాధనకు ఎందరో బలిదానం చేశారు. ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటులో ఆనాడు తెలంగాణ బిల్లు పెట్టారు. తల్లిని చంపి బిడ్డను ఎత్తుకుపోయారని ప్రధాని మోదీ ఆరోపించారు. ప్రధాని వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడట్లేదు. తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో ఎందుకు వివక్ష చూపిస్తున్నారు అని విమర్శించారు.
Tags :