ASBL NSL Infratech

ఇలా అయితే బుట్టబొమ్మ‌ను మ‌ర్చిపోతారేమో

ఇలా అయితే బుట్టబొమ్మ‌ను మ‌ర్చిపోతారేమో

మొన్న‌టివ‌ర‌కు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉన్న పూజా హెగ్డే ఒక్క‌సారిగా అవ‌కాశాల్లేక ఢీలా ప‌డిపోయింది. స్టార్ డైరెక్ట‌ర్లంతా ఆమె మీద ప‌గ ప‌ట్టిన‌ట్లు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వ‌కుండా కొత్త వాళ్ల‌ను చూసుకుంటున్నారు. మొన్న‌టివ‌ర‌కు పూజా సూప‌ర్ అన్న వాళ్లు ఇప్పుడు వేరే ఆప్ష‌న్స్ వెతుక్కుంటున్నారు.

దీంతో ఇక టాలీవుడ్ నుంచి ఆఫ‌ర్లు రావ‌డం క‌ష్ట‌మేని పూజా ఫిక్స్ అయిన‌ట్లు ఉంది. రీసెంట్ గా ఓ స్పెష‌ల్ సాంగ్ ఆఫ‌ర్ వ‌స్తే నో అనేసింద‌ట‌. రాక‌రాక వ‌చ్చిన ఛాన్స్ ను కూడా పూజా వ‌ద్దనుకుంది. ప్ర‌భాస్‌తో రాధేశ్యామ్ సినిమా త‌ర్వాత పూజా కెరీర్ బిజీగా అయిపోతుంద‌నుకుంటే సీన్ రివర్స్ అయిపోయి అస‌లు అవ‌కాశాలే రాకుండా పోయాయి.

రాధే శ్యామ్ త‌ర్వాత గుంటూరు కారం చేయాల్సింది. కానీ డేట్స్ అడ్జస్ట్ అవ‌క‌పోవ‌డం వ‌ల్ల ఆ సినిమా నుంచి త‌ప్పుకుంది. ఆ త‌ర్వాత పూజా పేరు టాలీవుడ్ లో వినిపించ‌లేదు. మ‌ధ్య‌లో అట్లీ, అల్లు అర్జున్ కాంబోలో వ‌చ్చే సినిమాలో పూజానే హీరోయిన్ అన్నారు కానీ ఇప్పుడా ప్రాజెక్టే క్యాన్సిల్ అయింది. ఇక మిగిలింది నాగ‌చైత‌న్య‌- కార్తీక్ దండు కాంబోలో వ‌స్తున్న సినిమా మాత్ర‌మే. ఆ సినిమాలో హీరోయిన్ గా పూజా పేరే వినిపిస్తోంది. ఈ సినిమా కూడా మిస్ అయితే టాలీవుడ్ ప్రేక్ష‌కులు పూజాని మ‌ర్చిపోతారేమో. ఇదిలా ఉంటే త‌మిళంలో మాత్రం పూజా, సూర్య స‌ర‌స‌న ఛాన్స్ కొట్టేసింది. మ‌రి ఆ సినిమా తో అయినా ఈ బుట్ట‌బొమ్మ సుంద‌రి మ‌ళ్లీ ఫామ్ లోకి వ‌స్తుందేమో చూడాలి.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :