ASBL NSL Infratech

"పౌరుషం - ది మ్యాన్ హుడ్" ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి రేపుతున్న సన్నివేశాలు

"పౌరుషం - ది మ్యాన్ హుడ్" ట్రైలర్ రిలీజ్.. ఆసక్తి రేపుతున్న సన్నివేశాలు

 

షెరాజ్ మెహ్ది దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా "పౌరుషం - ది మ్యాన్‌హుడ్".  UVT హాలీవుడ్ స్టూడియోస్ (యూఎస్ఏ), శ్రేయ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై అశోక్ ఖుల్లార్, దేవేంద్ర నేగి ఈ చిత్రాన్ని నిర్మించారు.  ఈ చిత్రం కోసం  ప్రతిభావంతులైన, ప్రఖ్యాత నటీనటులు పని చేస్తున్నారు. ఈ సినిమా సౌండ్‌ట్రాక్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగా తాజాగా చిత్ర ట్రైలర్ రిలీజ్ చేశారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఈ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో డాక్టర్ ఒలంపియా ఏ.జెలినీ, హాలీవుడ్ హీరోయిన్, సింగర్ ల్యూబా పామ్, అంబర్ మార్టినేజ్, సాగే, హాలీవుడ్ లక్స్ ఏంజెల్స్ స్టూడియోస్ కో- ప్రొడ్యూసర్ లెన్నీ విటుల్లి ముఖ్య అతిథులుగా విచ్చేశారు.   

ఈ సినిమాలో సుమన్ తల్వార్, మేకా రామ కృష్ణ, షెరాజ్, అశోక్ ఖుల్లార్, ఆమని, గీత రెడ్డి, జ్యోతి రెడ్డి, శైలజ తివారీ, అనంత్, కనిక, జబర్దస్త్ కెవ్వు కార్తీక్, , జబర్దస్త్ హీనా, జబర్దస్త్ కట్టప్ప, బాల గంగాధర్, వైజాగ్ షరీఫ్, లక్ష్మి, రవి వర్మ వంటి వారు నటిస్తున్నారు. చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంగీతం షేరాజ్ మెహ్దీ అందించారు. డివి ప్రభు ఎడిటర్ గా పనిచేస్తున్నారు. 

"పౌరుషం - ది మ్యాన్‌హుడ్" ట్రైలర్‌ను చూస్తుంటే.. ఉమ్మడి కుటుంబంలో ఎదురయ్యే సవాళ్లు, పాత సంప్రదాయాలను ప్రశ్నించేలా ఉంది. యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ ఉంటాయని ట్రైలర్ ద్వారా స్పష్టం చేశారు మేకర్స్. నేటి సమాజాన్ని ఆకర్షించే సన్నివేశాలతో కట్ చేసిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచేసింది. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :