ASBL NSL Infratech

ప్రేమ క‌థ కోసం రెడీ అవుతున్న డార్లింగ్

ప్రేమ క‌థ కోసం రెడీ అవుతున్న డార్లింగ్

నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన క‌ల్కి 2898ఏడీ మంచి హిట్ సాధించ‌డంతో ఆ స‌క్సెస్ ను సెల‌బ్రేట్ చేసుకోవడానికి ప్ర‌భాస్ విదేశాల‌కు వెళ్లాడు. ఇప్ప‌టికే క‌ల్కి రూ.500 కోట్ల క్ల‌బ్ లో జాయినైంది. క‌ల్కి క‌చ్ఛితంగా రూ.1500 కోట్లు సాధిస్తుంద‌ని నిర్మాత అశ్వినీద‌త్ ఎంతో ధీమాగా చెప్తున్నాడు. మ‌రి ఇదెంత వ‌ర‌కు సాధ్య‌మ‌వుతుంద‌నేది చూడాలి. ఇదిలా ఉంటే విదేశాల నుంచి వ‌చ్చాక ప్ర‌భాస్ ఏం చేయ‌బోతున్నాడ‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. డార్లింగ్ స‌న్నిహితులు చెప్తున్న దాని ప్ర‌కార‌మైతే ప్ర‌భాస్ తిరిగి ఇండియా రాగానే మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న రాజా సాబ్ ను పూర్తి చేస్తాడ‌ట‌. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ చాలా ఆల‌స్య‌మైంది కాబ‌ట్టి త్వ‌ర‌గా దాన్ని కంప్లీట్ చేయాల‌ని చూస్తున్నాడ‌ట.

దీంతో పాటూ హ‌ను రాఘ‌వ‌పూడి ప్రాజెక్ట్ ను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లాల‌ని చూస్తున్నాడ‌ట ప్ర‌భాస్. అక్టోబ‌ర్ లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని, ఇప్ప‌టికే ఆ సినిమా కోసం ప్ర‌భాస్ త‌న కాల్షీట్స్ ను అడ్జెస్ట్ చేసేశాడ‌ని టాక్. వ‌ర‌ల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్క‌నున్న ఈ ల‌వ్ స్టోరీ ప‌నుల్లోనే ద‌ర్శ‌కుడు హ‌ను ప్ర‌స్తుతం బిజీగా ఉన్నాడు. హీరోయిన్ గా మంచి ఫేమ్ ఉన్న భామ‌ను తీసుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. మ‌రి హ‌ను ప్ర‌భాస్ తో ఎలాంటి ప్రేమ‌క‌థ‌ను తెర‌కెక్కిస్తాడో చూడాలి.  

 

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :