ASBL Koncept Ambience
facebook whatsapp X

Prakash Raj : మెగా ఫ్యామిలీకి ప్రకాశ్ రాజ్ దూరమయ్యారా..!?

Prakash Raj : మెగా ఫ్యామిలీకి ప్రకాశ్ రాజ్ దూరమయ్యారా..!?

తిరుమల లడ్డూలో (Tirumala Laddu) కల్తీ నెయ్యి (adulterated ghee) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ అంశంపై చాలా మంది తమదైన శైలిలో స్పందిస్తున్నారు. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కొంతమంది కోరుతుంటే.. అనవసరంగా రాజకీయం చేస్తున్నారని మరికొంతమంది విమర్శిస్తున్నారు. ఇదే అంశంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (prakash raj) కూడా స్పందించారు. ఆయన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Deputy CM Pawan Kalyan) టార్గెట్ గా ట్వీట్లు చేస్తుండడం ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. ఒకప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీతో (Mega Family) అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిన ప్రకాశ్ రాజ్.. ఇప్పుడు వ్యతిరేక పోస్టులు పెడుతుండడంపై మెగా ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు.

లడ్డూలో కల్తీ నెయ్యి వాడడం ద్వారా తిరుమల (tirumala) పవిత్రతను గత వైసీపీ (YCP) ప్రభుత్వం దెబ్బ తీసిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు. అందుకు ప్రాయశ్చిత్తంగా ఆయన 11 రోజులపాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. కనక దుర్గ (Kanakadurga temple) ఆలయ మెట్లను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపాయి. ప్రకాశ్ రాజ్ అంటే తనకు గౌరవం ఉందని.. అయితే సనాతన ధర్మాన్ని కించపరిచేలా మాట్లాడడం తగదని ఆయన సూచించారు. అయితే తాను తప్పేమీ మాట్లాడలేదని విదేశాల నుంచి వచ్చాక వివరణ ఇస్తానని చెప్పారు. అంతటికే ఆగకుండా కార్తీతో సారీ చెప్పించుకోవడాన్ని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. వరుస ట్వీట్లతో (tweets) పవన్ కల్యాణ్ ను ఇరుకున పెడుతున్నారు.

అయితే ప్రకాశ్ రాజ్ కు, మెగా ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గత మా ఎన్నికల్లో (MAA Elections) ప్రకాశ్ రాజ్ ను నిలబెట్టింది మెగా ఫ్యామిలీయే. ముఖ్యంగా నాగబాబు (Nagababu) ఆయనకు వెన్నంటి నిలబడ్డారు. మంచు విష్ణుకు (Manchu Vishnu) వ్యతిరేకంగా ప్యానెల్ నిలబెట్టి ప్రచారం చేశారు. మెగా ఫ్యామిలీ మొత్తం ప్రకాశ్ రాజ్ కు అండగా నిలబడింది. ప్రకాశ్ రాజ్ అప్పుడు కేసీఆర్ కు (KCR) సన్నిహితంగా ఉండడం.. వాళ్లు కూడా మెగా ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలిచారనే ప్రచారం ఉంది. అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.

ప్రకాశ్ రాజ్ బీజేపీ (BJP) వ్యతిరేకి అనే విషయం తెలిసిందే. బీజేపీపై విమర్శలు చేయడంలో ప్రకాశ్ రాజ్ ముందుంటారు. బీజేపీతో కలిసి జనసేన పనిచేస్తోంది. పైగా హిందువులు, గుళ్లకు సంబంధించిన వ్యవహారం కావడంతో సహజంగానే ప్రకాశ్ రాజ్ నెగెటివ్ స్టాండ్ తీసుకుంటారు. బీజేపీని టార్గెట్ చేసేందుకు రెడీగా ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన అదే చేశారు. ఇలాంటి వాటిపైన రాద్ధాంతం అక్కర్లేదని.. కేంద్రంలో కూడా మీ మిత్రులే ఉన్నారు కాబట్టి చర్యలు తీసుకోండి అనేలా సెటైర్లు వేశారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పవన్ కల్యాణ్.. హిందువులంటే ఇంత చులకనా.. మిగిలిన మతాల విషయంలో ఇలా ఎందుకు స్పందించరు.. అనేలా కామెంట్స్ చేశారు. మొత్తానికి మెగా ఫ్యామిలీతో ప్రకాశ్ రాజ్ కు గ్యాప్ బాగా పెరిగిపోయినట్లు అర్థమవుతోంది.

 

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :