వర్మకు షాక్ తగిలిందిగా!
ఈ వారం రిలీజైన సినిమాల్లో వీక్ టాక్ వచ్చిన సినిమా దేవకీనందన వాసుదేవ(Devaki nandhana vasudeva)నే. చాలా గ్యాప్ తర్వాత గల్లా అశోక్(Galla Ashok) నుంచి వచ్చిన సినిమా కావడంతో కంటెంట్ బావుంటుందనుకున్నారంతా. కానీ సినిమా ఏ మాత్రం ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. ఇక అసలు విషయానికొస్తే హనుమాన్(Hanuman) లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ(Prasanth Varma) ఈ సినిమాకు కథను అందించాడు.
కథను అందించడమే కాదు, ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం కూడా చేశాడు. ఇంతచేసినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోతుంది. కథను ఈ ట్రెండ్ కు కనెక్ట్ అయేలా చెప్పడంలో డైరెక్టర్ అర్జున్ జంధ్యాల(Arjun Jandhyala) సక్సెస్ అవలేకపోయాడు. దానికి తోడు అశోక్ బాడీ లాంగ్వేజ్ కు మించి ఎలివేషన్స్ ఇవ్వడం కూడా అసలు సెట్ అవలేదు.
ఆర్టిస్టుల సెలెక్షన్ నుంచి రొటీన్ సీన్స్, అనవసరమైన కామెడీ ఇలా ఎన్నో అంశాలు ఈ సినిమాను నీరసంగా మార్చాయి. దీనికి బాధ్యుడు ప్రశాంత వర్మ కాకపోయినా కథ అందించింది అతనే కాబట్టే ఆడియన్స్ ప్రశాంత్ వర్మ కథ ఇది అని మాత్రమే చూస్తారు. జనాల్లో ఈ సినిమాను దర్శకనిర్మాతలు అలానే రిజిస్టర్ చేశారు కూడా. మొత్తానికి ప్రశాంత్ వర్మ కు ఈ సినిమా రూపంలో షాక్ అయితే తగిలింది.