ASBL Koncept Ambience
facebook whatsapp X

మోక్ష‌జ్ఞ కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ వేట‌

మోక్ష‌జ్ఞ కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ వేట‌

నంద‌మూరి బాల‌కృష్ణ కొడుకు, న‌ట వార‌సుడు మోక్ష‌జ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ సినిమా భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది. ప్ర‌శాంత్ వ‌ర్మ సినిమాటిక్ యూనివ‌ర్స్ లో భాగంగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ లుక్ ను రిలీజ్ చేస్తూ ఈ సినిమాను మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.

మ‌రో రెండు మూడ నెల‌ల్లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు కానుంద‌ని, ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ జరుగుతున్నాయ‌ని తెలుస్తోంది. భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న సినిమా కాబ‌ట్టి సినిమాలో క్యాస్టింగ్ కూడా అంతే భారీగా ఉండాల‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ భావిస్తున్నాడ‌ట‌.  

ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్ కోసం ప్ర‌శాంత్ వ‌ర్మ వెతుకుతున్నాడ‌ట‌. మొద‌ట ఖుషి క‌పూర్ ను అనుకున్నార‌ట కానీ త‌ర్వాత మ‌ళ్లీ డెసిష‌న్ ను మార్చుకుని మంచి ఫేమ్ ఉన్న స్టార్ హీరోయిన్ ను తీసుకోవాల‌ని చూస్తున్నార‌ట‌. దీంతో ఇప్పుడు మోక్ష‌జ్ఞ‌కు హీరోయిన్ కు వెత‌కడం ప్ర‌శాంత్ వ‌ర్మకు పెద్ద ఛాలెంజ్ గా మారింది. అక్టోబ‌ర్ నాటికి హీరోయిన్ ను ఫైన‌ల్ చేసి మిగిలిన క్యాస్టింగ్ కు ఎంపిక చేయాల‌ని ప్ర‌శాంత్ వ‌ర్మ చూస్తున్నాడ‌ట‌.

 

 

praneet praneet praneet ASBL Radhey Skye Radha Spaces
Tags :