కాగ్ అధిపతిగా తెలుగు అధికారి.. సంజయ్‌మూర్తి ప్రమాణ స్వీకారం
ప్రతిష్ఠాత్మక భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్‌మూర్తి చేపట్టారు. కాగ్ అధిపతిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా సంజయ్మూర్తిగా అరుదైనత ఘనత సాదించారు. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు సంజయ్‌మూర్తి. 1964 డిసెంబర్ 24న జన్మించిన ఆయన, మెకానికల్ విభాగంలో ఇంజినీరింగ్ చదివారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్‌ప్రదేశ్ కేడర్‌కు ఎంపికైన, ఆ తర్వాత కేంద్ర సర్వీసుల్లో పనిచేశారు. 2021 సెప్టెంబరు నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానం అమలులో క్రియాశీలక పాత్ర పోషించారు.
Tags :